»Addanki Si Family Died In Road Accident At Medarametla Bypass
Shocking Incident ఘోర ప్రమాదం.. ఐదుగురి ప్రాణం తీసిన టైర్ పంక్చర్
కారు ప్రమాదం జరిగిన తీరుపై అనుమానాలు వస్తున్నాయి. కారు టైర్ పంక్చర్ (Tyre Puncture) కావడంతో ప్రమాదం జరిగిందని కొందరు చెబుతుండగా.. మరికొందరు డ్రైవర్ (Car Driver) నిద్ర మత్తులోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా గోతులు ఏర్పడి రోడ్లు అధ్వానంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వరుసగా రోడ్డు ప్రమాదాలు (Road Accident) సంభవిస్తున్నారు. అతుకులు గతుకుల రోడ్లతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. నిత్యం రహదారుల్లో రక్తమోడుతున్నాయి. తాజాగా బాపట్ల జిల్లా (Bapatla District)లో ఘోర ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏకంగా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మహా శివరాత్రి పురస్కరించుకుని జరిగిన తిరునాళ్లు చూసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతి చెందిన వారిలో ఎస్సై భార్య, కూతురు ఉండడం గమనార్హం. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అద్దంకి (Addanki) ఎస్సై (Sub Inspector) సమందర్ వలీ చిన్నగంజాం (Chinnaganjam)లో జరిగిన తిరునాళ్లకు బందోబస్తుగా వెళ్లాడు. వెంట తన భార్య, పాపతో పాటు మిగతా కుటుంబసభ్యులను తీసుకెళ్లాడు. తిరునాళ్లను చూసిన అనంతరం ఎస్సై అక్కడే విధుల్లో ఉండగా తన కుటుంబసభ్యులను అద్దంకికి కారులో పంపించాడు. వహీదా (39), ఆయేషా (9), గుర్రాల జయశ్రీ (50), గుర్రాల దివ్య తేజ (27)తో కలిసి డ్రైవర్ వీర బ్రహ్మాచారి శనివారం రాత్రి కారు (టీఎస్07 జీడీ 3249)లో బయల్దేరాడు. ఒంగోలు నుంచి గుంటూరు (Guntur) వైపు వెళ్తోంది. బాపట్ల జిల్లా కొరిశపాడు (Korishapadu) సమీపంలోని మేదరమెట్ల దక్షిణ బైపాస్ చేరుకోగానే కారు ఒక్కసారిగా కారు అదుపు తప్పింది. డివైడర్ దాటి అవతలి వైపు రోడ్డుపైకి ఎగిరి వెళ్లి పడిపోయింది. ఆ సమయంలో గుంటూరు నుంచి ఒంగోలు (Ongole) వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో కారులోని ఐదుగురు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న అద్దంకి సీఐ రోశయ్య సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విధుల్లో ఉన్న ఎస్సై సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించాడు. కట్టుకున్న భార్య, కుమార్తె ఒకేసారి కన్నుమూయడంతో అతడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.
ప్రమాదంపై అనుమానాలు
అయితే కారు ప్రమాదం జరిగిన తీరుపై అనుమానాలు వస్తున్నాయి. కారు టైర్ పంక్చర్ (Tyre Puncture) కావడంతో ప్రమాదం జరిగిందని కొందరు చెబుతుండగా.. మరికొందరు డ్రైవర్ (Car Driver) నిద్ర మత్తులోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా గోతులు ఏర్పడి రోడ్లు అధ్వానంగా మారాయి. ఈ సమయంలో బైపాస్ రోడ్డుకు చేరుకోగానే అక్కడ రోడ్డు బాగా లేక ఒక్కసారిగా టైర్ పంక్చర్ అయిందని అక్కడి స్థానికులు చెప్పారు. అయితే ప్రమాదానికి అది కాదని మరికొందరు చెబుతున్నారు. డ్రైవర్ బ్రహ్మాచారి కారు నడుపుతున్న సమయంలో కునుకు తీశాడని చెప్పారు. నిద్రలోకి జారుకోవడంతో కారు అదుపు తప్పి ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది అని కూడా చెబుతున్నారు. పోలీసులు మాత్రం వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియడం లేదు.