KMM: మధిర, జిలుగుమాడు సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ అనిల్ కుమార్ తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా జిలుగుమాడు, ఆత్మకూరు, నక్కలగురువు, కాచీపురం, మాటూరు, మాటూరుపేట, నాగవరప్పాడు, సైదుల్లిపల్లి, సిద్దినేనిగూడెం అంబారుపేట గ్రామాల్లో ఉ.9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. వినియోగదారులు సహకరించాలన్నారు.