»Excessive Use Of Gym Supplement 22 Years Young Man Admitted To Hospital Delhi
Shoking: జిమ్ సప్లిమెంట్స్ ఎక్కువగా వాడకం..ఐసీయూలో చేరిన యువకుడు!
మంచి బాడీ షేప్స్, కండలు తిరిగిన మజిల్స్, సిక్స్ ప్యాక్ కోసం యువకులు ఎక్కువగా జిమ్ సప్లిమెంట్లను వాడుతూ ఉంటారు. అయితే వీటి వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు. ఇటీవల ఢిల్లీలో ఓ 22 ఏళ్ల యువకుడు దీర్ఘకాలంగా జిమ్ సప్లిమెంట్స్ వాడుతూ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స చేయించుకున్నాడు.
యువకులారా మీరు కూడా జిమ్ సప్లిమెంట్స్(gym supplements) ఎక్కువగా వాడుతున్నారా? అయితే జాగ్రత్త! ఎందుకంటే వాటిని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల నాడీ సంబంధ వ్యాధులతోపాటు ఇతర రోగాలు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఓ 22 ఏళ్ల యువకుడు(young man) అనేక రోజులుగా జిమ్ సప్లిమెంట్లను తీసుకోవడంతో ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువగా ఉండటంతో ఆసుపత్రి(hospital)లో చేరాడు. ఆ క్రమంలో యువకుడు కోమాలోకి వెళ్లడంతో దక్షిణ ఢిల్లీ(south Delhi)లోని పీఎస్ఆర్ఐ ఆసుపత్రిలోని అత్యవసర వార్డుకు తరలించారు. తర్వాత ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువగా ఉన్నందున, అతనికి వెంటిలేటర్ పై చికిత్స అవసరమని వెంటనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)కి తరలించి చికిత్స అందించారు. అక్కడ అతను ఒక వారం రోజులపాటు ఉన్న తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. అయితే ఆ యువకుడు జిమ్ సప్లిమెంట్ ప్రొటీన్ పౌడర్ అధికంగా వాడినట్లు వైద్యుల పరిశీలనలో తేలింది.
రోగికి టాక్సిక్ ఎన్సెఫలోపతి ఉన్నట్లు నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. టాక్సిక్ ఎన్సెఫలోపతి, రాబ్డోమియోలిసిస్ వల్ల మెదడు పనిచేయకపోవడం వల్ల సంభవించే ఒక పరిస్థితి అని వివరించారు. ఇది ప్రాణాంతకమైన పరిస్థితి అని.. దీని ద్వారా శాశ్వత వైకల్యానికి కూడా దారితీయవచ్చని వెల్లడించారు. మరోవైపు రోగి మాదకద్రవ్యాలు వినియోగించినట్లు ఆధారాలు లేవన్నారు. కండర కణజాలం విచ్ఛిన్నానికి దారితీసిన క్రియేటిన్ ఫాస్ఫోకినేస్ వంటివి అధిక స్థాయి కండరాల ఎంజైమ్లతో పాటు రోగి తీవ్రమైన జీవక్రియ లోపంతో బాధపడుతున్నట్లు ఆసుపత్రి(hospital) వైద్యులు(doctors) తెలిపారు. ఈ క్రమంలో రోగి గణనీయమైన కండరాల విచ్ఛిన్నానికి గురయ్యే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. దీని ఫలితంగా కాల్షియం స్థాయి తగ్గడం, పర్యవసానంగా, ఇది మూర్ఛలు, స్పృహ కోల్పోవడానికి దారి తీస్తుందని చెప్పారు.
అయితే జిమ్ సప్లిమెంట్ల(gym supplements)ను అధికంగా ఉపయోగించడం వల్ల ఈ క్రింది దుష్ప్రభావాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.