»Social Media War With Karnataka Ias Rohini And Ips Officer Roopa
Social Media War: ఇద్దరు IAS, IPS అధికారుల మధ్య ఫొటోల లొల్లి
కర్ణాటకలో ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారుల మధ్య లొల్లి అక్కడి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. IAS అధికారిణి రోహిణి సింధూరి వ్యక్తిగత ఫోటోలను.. IPS అధికారిణి డీ రూప మౌద్గిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు లొల్లి మొదలైంది. వీరి గొడవ ఎంటో తెలుసుకోవాలంటే కింది వార్తను చదివాల్సిందే.
కర్ణాటక(Karnataka)లో ఇద్దరు ప్రముఖ IAS, IPS అధికారులు సోషల్ మీడియా(social media)వేదికగా వ్యక్తిగత ఫోటోల(personal pics) గురించి గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది. విషయం తెలిసిన అక్కడి ప్రభుత్వం సహా పలువురు అధికారులు ఇలా బహిరంగంగా కామెంట్లు చేసుకోవడం సరికాదని సూచిస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే..IAS ఆఫీసర్ రోహిణి సింధూరి (Rohini sindhuri) పర్సనల్ ఫొటోలను.. IPS అధికారిణి డీ రూప మౌద్గిల్(roopa d moudgil) సోషల్ మీడియాలో ఆదివారం పోస్ట్ చేశారు. మరోవైపు ఇదే ఫొటోలను ఇదివరకు రోహిణి పలువురు పురుష IAS అధికారులకు కూడా షేర్ చేశారని రూప అంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య సోషల్ మీడియాలో కామెంట్ల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు కామెంట్ల(comments)తోపాటు అవినీతి ఆరోపణలు కూడా చేసుకున్నారు. మరోవైపు ఈ అంశంపై సీఎం ప్రధాన కార్యదర్శి శర్మకు కూడా కంప్లైంట్ చేసినట్లు రూప(roopa) చెబుతున్నారు.
మరోవైపు స్పందించిన రోహిణి(Rohini) తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పరువుకు భంగం కలిగించే విధంగా తన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..తర్వాత నేనే వేరే వాళ్లకి పంపానని ఆరోపిస్తున్నారని రోహిణీ పేర్కొన్నారు. అసలు నేను ఫోటోలు పంపిన వ్యక్తులు ఎవరో కూడా చెప్పాలని ప్రశ్నించారు. ఇలా వీరిద్దరు ఫేస్ బుక్ వేదికగా కామెంట్లు చేసుకోవడంతో వీరి గొడవ కాస్తా కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఐఏఎస్ రోహిణి సింధూరి ప్రస్తుతం కర్ణాటక మతం, స్వచ్ఛంద సంస్థ శాఖ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఐపీఎస్ అధికారిణి డీ రూప(roopa).. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.
విషయం తెలుసుకున్న కర్ణాటక(Karnataka) హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర(home minister araga jnanendra) తప్పు చేసిన ఇద్దరు మహిళా అధికారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ అంశంపై ఇప్పటికే డీజీపీతో మాట్లాడానని, సీఎం కూడా దీనిపై ఆలోచిస్తున్నారన్నారని తెలిపారు. వారిని ఇప్పటికే హెచ్చరించామని తెలిపారు. ఇది ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందన్నారు. దీనిపై ఆయన నిర్ణయం తీసుకుంటారని జ్ఞానేంద్ర(jnanendra) అన్నారు.