ఎమ్మెల్యే వల్లభనేని అనుచరులు, వైసీపీ వర్గీయులు రణరంగం సృష్టించారు. సోమవారం సాయంత్రం తెలుగు దేశం పార్టీ కార్యాలయం పైన కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఇష్టారీతిన దాడులు చేయడంతో పలువురు కార్యకర్తలతో పాటు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనలో టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి అరెస్ట్ చేశారు. ఈ అంశం పైన పట్టాభిరామ్ భార్య చందన మీడియా ముందుకు వచ్చారు.
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (vallabhaneni vamshi) అనుచరులు, వైసీపీ (ycp) వర్గీయులు రణరంగం సృష్టించారు. సోమవారం సాయంత్రం తెలుగు దేశం పార్టీ కార్యాలయం (Telugudesam) పైన కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఇష్టారీతిన దాడులు చేయడంతో పలువురు కార్యకర్తలతో పాటు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనలో టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి అరెస్ట్ చేశారు. ఈ అంశం పైన పట్టాభిరామ్ (pattabhi) భార్య చందన (chandana) మీడియా ముందుకు వచ్చారు. గన్నవరం పార్టీ కార్యాలయం దాడి విషయం తెలిసి తన భర్త అక్కడికి వెళ్లారని చెప్పారు. అక్కడ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారని, డ్రైవర్, పీఏ పోలీస్ స్టేషల్ ఉన్నారని, కానీ తన భర్త అక్కడ లేరని ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను పోలీసులు ఎక్కడకి తీసుకెళ్లారో తెలియదు అన్నారు. ఆయన ఫోన్ నంబర్ కు కాల్ చేస్తే స్విచాఫ్ వస్తోందన్నారు. తన భర్తకు ఏం జరిగినా ముఖ్యమంత్రి, డీజీపీదే బాధ్యత అన్నారు.
గవర్నర్ ను కలిశాం… వర్ల
తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గవర్నర్ ని కలిశామని వర్ల రామయ్య (varla ramaiah) చెప్పారు. ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో జరిగిన అరాచక పాలన పై పిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇంకొంచెం యాక్టివ్ గా పనిచేసి ఉంటే బాగుండేది, ఎప్పుడు మన ప్రభుత్వమే వచ్చేది అన్నారు. ఇక్కడకు చంద్రబాబు రావాల్సింది అని, కానీ నందమూరి తారకరత్న కార్యక్రమంలో ఉన్నారని వెల్లడించారు.
వంశీ రౌడీయిజం.. కొనకళ్ల
వల్లభనేని వంశీ టీడీపీ నుండి గత ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో గెలిచి వైసిపికీ వెళ్లి అరాచకాలు చేస్తున్నాడని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ (konakalla narayana) మండిపడ్డారు. రౌడీయిజం చేస్తున్నారని, దీనిని సహించేది లేదన్నారు. ఈ రోజు టీడీపీ పార్టీ ఆఫీస్ పై దాడి చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చేతకాని పోలీసు వ్యవస్థ దేనికి వంశీ అనుచరులను పంపించి పార్టీ కార్యాలయాల పైన దాడి చేసి కార్లు కాల్చివేసారన్నారు. అసలు వంశీ, వైసీపీ వారికి మనసాక్షి ఉందా.. అక్కడ టీడీపీ ఇంఛార్జి చావు బ్రతుకుల మధ్య ఉంటే దాడులు చేస్తున్నారని దుమ్మెత్తి పోశారు. విమర్శకు ప్రతి విమర్శ రాజకీయం కానీ దాడులను ప్రజలు సహించరని చెప్పారు. వంశీ… నువ్వు ఎన్ని చేసినా గన్నవరం ప్రజలు నిన్ను వచ్చేసారి ఓడిస్తారన్నారు. వెంటనే వంశీపై పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొట్టుకుందాం రండి
రెండు సంవత్సరాలుగా కొడాలి నాని, దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ అనే ముగ్గురు పకోడీ నా కొడుకులు జగన్ దగ్గర మార్కుల కోసం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మీకు దమ్ముంటే ఎన్ టి ఆర్ సర్కిల్ దగ్గర మీరే టైమ్ చెప్పి వస్తే మీరో మేమో తేల్చుకుందాని సవాల్ చేశారు. ఎవరూ లేనిసమయంలో ఆఫీస్ లు పగలకొట్టడం మగతనమా, మీకు బీ ఫారం ఇచ్చింది తెలుగు దేశం కదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు నీకు టికెట్ ఇస్తే దానికి ఇది బహుమానమా అని విమర్శించారు. త్వరలో వీరందరూ ఎందుకు పార్టీ మారారో, ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారో, అన్ని వివరాలతో ప్రజల ముందుకు వస్తామని చెప్పారు. వీరికి స్థాయి ఉందా అంటూ ద్వజమెత్తారు. కొడాలి నాని ఎన్ టి ఆర్… డి ఎన్ ఏ లా మాట్లాడుతాడని, పోలీసు వ్యవస్థ మీ చేతుల్లో ఉంది వాళ్ళను గొడవ దగ్గరకు రావద్దని చెప్పండి.. ఎప్పుడు కొట్టుకుందాం అని సవాల్ చేశారు. మీకు 4+4 గన్ మెన్ లు ఎందుకు , మీకు నిజంగా మీసం మొలిచిన వారు అయితె రండి కొట్టుకుందామన్నారు. వీరు ఆరాచకం చేస్తున్నారని, చేసే పనులు ఆడంగి పనులు అన్నారు.