ATP: జిల్లాలో వివిధ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆర్అండ్బీ పరిధిలోని 17 రకాల రహదారి పనులను ఏప్రిల్ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.