ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ పై ఎంతలా ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. టీజర్‌లోని గ్రాఫిక్స్ యానిమేషన్లా ఉన్నాయని తేల్చేశారు జనాలు. దీని దెబ్బకు ఓం రౌత్ సినిమాను ఆరు నెలలు పోస్ట్ పోన్ చేశాడు. జూన్ 16న ఆదిపురుష్ రిలీజ్ అవడం పక్కా అంటున్నారు. ప్రస్తుతం గ్రాఫిక్స్‌ని మరింతగా ఇంప్రూవ్ చేస్తున్నాడు ఓం రౌత్. ఈసారి అవుట్ పుట్ అదిరిపోయిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఒక్క సీన్ కోసం భారీగా ఖర్చు పెట్టినట్టు సమాచారం. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సైఫల్ అలీఖాన్ రావణ్‌గా నటిస్తున్నాడు. ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య ఓ యాక్షన్ సీన్ అదిరిపోతుందట. సముద్ర నేపథ్యంలో సాగే భారీ పోరాట సన్నివేశం కోసం ఏకంగా 12 కోట్లు ఖర్చుచేశారట మేకర్స్. ఆ సీన్ సినిమాలో విజువల్ ఫీస్ట్ ఇచ్చేలా ఉంటుందట. ముఖ్యంగా త్రీడిలో అద్భుతం అనేలా ఉంటుంట. ఇదే కాదు మిగతా సీన్స్ కూడా అదరహో అనేలా ఉండనున్నాయట. అందుకోసం భారీగా ఖర్చు చేస్తున్నారట. మొత్తంగా ఈ సినిమాను 600 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ముందుగా ఈసినిమాను 500 కోట్లలో కంప్లీట్ చేయాలనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ తేడా కొట్టడంతో మరో 100 నుంచి 150 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నట్టు టాక్. అయితే లేటెస్ట్ అప్డేట్ మాత్రం సినిమా పై అంచనాలను పెంచేస్తోంది. ఇటీవల సీత పాత్రలో నటిస్తున్న కృతి సనన్.. ఆదిపురుష్ దేశం గర్వించదగ్గ సినిమా అవుతుందని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు ఒక్క సీన్‌కు 12 కోట్లు ఖర్చు అయిందంటున్నారు. కాబట్టి ఆదిపురుష్‌లో అద్భుతంగా ఉంటుందని నమ్ముతున్నారు ఆడియెన్స్. మరి ఓం రౌత్ ఏం చేస్తాడో చూడాలి.