»Chandrababu Naidu Fires At Ys Jagan Over Gannavaram Issue
Gannavaram: జగన్ ఏంటి ఈ అరాచకం.. చంద్రబాబు, నాకు సంబంధం లేదన్న వల్లభనేని
గన్నవరం(gannavaram) టీడీపీ కార్యాలయంపై (Telugudesam) కొందరు దుండగులు చేసిన దాడిని, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
గన్నవరం(gannavaram) టీడీపీ కార్యాలయంపై (Telugudesam) కొందరు దుండగులు చేసిన దాడిని, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu). వైసీపీ రౌడీలు దాడి చేశారు అన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్న ముఖ్యమంత్రి జగన్ ( ys jagan) ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమన్నారు. వైసీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారని, పోలీసు శాఖను మూసేశారా లేక పోలీసు వ్యవస్థను వైసీపీలో విలీనం చేశారా అని ఎద్దేవా చేశారు. సీఎం ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణ అన్నారు. రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాడికి కారణమైన వారిపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
మరోవైపు గన్నవరం ఘటన పైన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. గన్నవరంలో జరిగే ప్రతి ఘటనకు తనకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. బయరివాళ్లు వచ్చి గొడవ చేసి ఉంటారని, తను ఎవరితోనూ మొదట గొడవకు దిగానని చెప్పారు. బయటి వాళ్లు వచ్చి ఇక్కడ గన్నవరంలో గొడవ చేశారని, కేవలం తన అనుచరులే దాడికి దిగారంటూ ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోందని అన్నారు. బయటివాళ్లు ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. తాను ఎవరిపైనా ఫస్ట్ అటాక్ చేయనని, తన జోలికి వస్తే మాత్రం వదలనని స్పష్టం చేశారు. తానే కాదు, కొడాలి నాని కూడా ఇలాగే ఉంటాడని చెప్పారు. సంకల్పసిద్ధి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, న్యాయం తనవైపే ఉందన్నారు. చంద్రబాబు చరిత్ర తనకు, కొడాలి నానికి తెలుసునని, అందుకే వారి నేతలను తమపై ఉసిగొల్పుతున్నాడన్నారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, మామూలు విషయాలకు కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రజల కంటే ఎక్కువగా మీడియాను, సోషల్ మీడియాను నమ్ముకుంటాడని, ఆయనకు తెలిసింది కేవలం గుడ్డ కాల్చి ముఖంపై వేయడమేనని, అందులో సిద్ధహస్తుడని విమర్శించారు. కొడాలి నాని, తాను కూడా చేతులు కట్టుకుని ఏమీ లేమని, తాము కూడా ఆ స్కూలు నుంచి వచ్చిన వాళ్లమేనని గుర్తు చేస్తూ… హెచ్చరించారు.
గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. చంద్రబాబు, లోకేష్ లను ఎమ్మెల్యే వంశీ తీవ్ర పదజాలంతో విమర్శించడంతో రగడ మొదలైంది. వంశీపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వంశీ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మా నాయకుడినే విమర్శిస్తారా.. అంటూ వంశీ అనుచరులు రెచ్చిపోయారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. టీడీపీ కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేసి, ఆఫీసు ఆవరణలో ఉన్న కారుకు నిప్పంటించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.