India W vs Ireland W: దంచికొట్టిన స్మృతి మంధాన..టీమిండియా స్కోర్ 155
మహిళల టీ20 వరల్డ్ కప్ నేడు టీమిండియా(Team India) కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా(Team India) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
మహిళల టీ20 వరల్డ్ కప్ నేడు టీమిండియా(Team India) కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లో ఐర్లాండ్(IND W vs IRE W)తో టీమిండియా(Team India) తలపడుతోంది. టీమిండియా కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో ఓపెనర్ స్మృతి మంధాన చెలరేగింది. స్మృతి మంధాన(Smriti Mandhana) 56 బంతుల్లోనే 87 రన్స్ చేసింది. ఆమె స్కోరులో 9 ఫోర్లు, 3 సిక్సులు ఉండటం విశేషం. టీమిండియా(Team India)లో ఇతర బ్యాటర్లు అంతగా స్కోరు చేయలేకపోయారు. దీంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది.
టీమిండియా(Team India) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. భారత జట్టులోని ఇతర బ్యాటర్లు షెఫాలీ వర్మ 24, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 13, జెమీమా రోడ్రిగ్స్ 19 రన్స్ చేసి స్కోరును ముందుకు నడిపారు. రిచా ఘోష్, దీప్తి శర్మ డకౌట్ అయ్యి అభిమానులను నిరాశ పరిచారు. ఇకపోతే ఐర్లాండ్ బౌలర్లలో కెప్టెన్ లారా డెలానీ 3 వికెట్లను పడగొట్టింది. ఓర్లా ప్రెండెర్ గాస్ట్ 2, ఆర్లెన్ కెల్లీ 1 వికెట్ ను తీశారు. ఐర్లాండ్ టార్గెట్ 156గా ఉంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఐర్లాండ్ ను దెబ్బకొట్టాలని భారత మహిళా క్రికెట్ జట్టు తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది.