నీతి ఆయోగ్(NITI) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO)గా బీవీఆర్ సుబ్రహ్మణ్యంను కేంద్రం సోమవారం నియమించింది. ప్రస్తుత సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ మూడేళ్లపాటు ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వెళ్లనున్నారు.
నీతి ఆయోగ్(Niti Aayog) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO)గా బీవీఆర్ సుబ్రహ్మణ్యం(BVR Subrahmanyam) నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ప్రస్తుత సీఈవో పరమేశ్వరన్ అయ్యర్(Parameswaran lyer) మూడేళ్లపాటు ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించనున్నారు. అయ్యర్ 1988-బ్యాచ్ IAS అధికారి రాజేష్ ఖుల్లార్ స్థానంలో ఉన్నారు. అతను తన క్యాడర్ స్టేట్ హర్యానాకు తిరిగి వెళ్లిన క్రమంలో పరమేశ్వరన్ వచ్చారు.
ఇక సుబ్రహ్మణ్యం(Subrahmanyam) గతంలో జమ్మూ కశ్మీర్(jammu kashmir) ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. దీంతో పాటు అక్కడి రాష్ట్ర బ్యూరోక్రసీలో కీలక పాత్ర పోషించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, రెండు ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం గురించి సమాచారం అందించిన కొద్దిమంది అధికారుల్లో సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు.
చదవండి: Viral video: ఇమ్రాన్ హష్మీ, అక్షయ్ తో స్టెప్పులేసిన మృణాల్ ఠాకూర్
సుబ్రహ్మణ్యం ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి. గత సంవత్సరం సెప్టెంబర్ 30న పదవీ విరమణ తర్వాత రెండేళ్ల కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
ఛత్తీస్‌గఢ్(chhattisgarh)లో గత ఏడాది జూన్‌లో గవర్నర్ పాలన ప్రకటించిన తర్వాత జమ్మూ కాశ్మీర్(jammu kashmir)కు డిప్యూట్ చేయబడ్డారు. 56 ఏళ్ల సుబ్రహ్మణ్యం గతంలో 2004 నుంచి 2008 వరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రైవేట్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ప్రపంచ బ్యాంకులో పనిచేసిన తర్వాత 2012లో మళ్లీ ప్రధానమంత్రి కార్యాలయంలో చేరారు.