KA Paul : కవిత త్వరలోనే అరెస్ట్ అవుతుంది…. కేఏ పాల్..!
KA Paul : ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎప్పుడో కానీ... మీడియా ముందుకు రాని ఆయన ఈ మధ్య... అధికార పార్టీని, పలువురు నేతలను టార్గెట్లు చేస్తూ స్టేట్మేంట్స్ ఇస్తున్నారు. తాజాగా... తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం గురించి కూడా తనదైన శైలిలో విమర్శలు గుపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో అతి త్వరలో కవితను అరెస్ట్ చేస్తారని, సీఆర్ దేశ్ కీ నేత అయినంత మాత్రాన కవితను అరెస్ట్ చేయకుండా ఉండరని కేఏ పాల్ అన్నారు.
ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎప్పుడో కానీ… మీడియా ముందుకు రాని ఆయన ఈ మధ్య… అధికార పార్టీని, పలువురు నేతలను టార్గెట్లు చేస్తూ స్టేట్మేంట్స్ ఇస్తున్నారు. తాజాగా… తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం గురించి కూడా తనదైన శైలిలో విమర్శలు గుపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో అతి త్వరలో కవితను అరెస్ట్ చేస్తారని, సీఆర్ దేశ్ కీ నేత అయినంత మాత్రాన కవితను అరెస్ట్ చేయకుండా ఉండరని కేఏ పాల్ అన్నారు.
అంబేద్కర్ జయంతి రోజునే తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభించాలని కే.ఏ.పాల్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని సీఎంకు డెడ్ లైన్ విధించారు. మరో మూడు రోజుల్లోగా కొత్త సచివాలయం ప్రారంభోత్సవ విషయంలో ప్రకటన రాకపోతే తాను నిరసనకు దిగుతానని హెచ్చరించారు. ఫిబ్రవరి 17న తెలంగాణ వ్యాప్తంగా అంబేద్కర్ మద్దతుదారులు జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తాను ఢిల్లీలో గానీ, హైదరాబాద్ లో గానీ ఆమరణ నిరాహారదీక్ష చేపడతానని ప్రకటించారు. కేసీఆర్ తాను ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, దళితులను మోసం చేస్తున్నారని కేఏ పాల్ మండిపడ్డారు.
కేసీఆర్ దేశ్ కీ నేత కాదని పాల్ అన్నారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభకు వచ్చిన సీఎంలకు డబ్బులు ఇచ్చి తీసుకువచ్చారని పాల్ ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు, నేతలు అంతా బానిసలుగా బ్రతుకుతున్నారని కేఏపాల్ విమర్శించారు.