»Ka Paul Who Met Cm Revanth Reddy What Is The Matter
KA Paul: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేఎ పాల్.. విషయం ఏంటంటే?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జనవరి 30న హైదరాబాద్లో నిర్వహించే ప్రపంచ శాంతి సదస్సుకు సీఏంను ఆహ్వానిస్తూ.. నిర్వాహణకు కావాల్సిన అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
KA Paul who met CM Revanth Reddy.. What is the matter?
KA Paul: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) కలిశారు. ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జనవరి 30న హైదరాబాద్లో ప్రపంచ శాంతి సదస్సుకు అనుమతులు మంజూరు చేయాలని విజ్ఙప్తి చేశారు. అనంతరం ఆయన్ను సదస్సుకు హాజరు కావాలని అహ్వానం అందించారు. కార్యక్రమం నిర్వాహణకు సంబంధించి కీలక విషయాలను సీఎంకు వివరించారు. సీఎంతో భేటీ తరువాత కేఏ పాల్ మాట్లాడుతూ.. సదస్సుకు అనుమతిచ్చే అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులను ఆహ్వానించినట్లు తెలిపారు. అలాగే విదేశాల నుంచి వేలమంది ప్రతినిధులు ప్రపంచ శాంతి సదస్సుకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.