తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) సోమవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారని వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా సీఎంవో (CMO) స్పందించింది. సీఎం ఎలాంటి అనారోగ్యం బారిన పడలేదని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని సీఎంవో స్పష్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి గొంతునొప్పితో బాధపడుతూ అస్వస్థతకు గురయ్యారని, ఆ కారణంగానే క్రిస్మస్ వేడుకలకు దూరమైనట్లు జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా స్పందించిన సీఎంవో ఆ ప్రచారాలు అన్నింటినీ ఖండిస్తూ ప్రకటన చేసింది.
ఏసుక్రీస్తు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని… పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలని ఆకాంక్షిస్తూ… క్రైస్తవ సోదర సోదరీమణులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు.#Christmaspic.twitter.com/RxQsPbt2c5
సీఎం ఎలాంటి అనారోగ్యం బారిన పడలేదని సీఎంవో (CMO) స్పష్టం చేసింది. నేడు మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ వంటివారు సీఎంను కలిసి పలు అంశాలపై చర్చించినట్లుగా సీఎంవో వెల్లడించింది. ఆదివారం కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లో ఉన్నారు. ఆ సమావేశంలో సీఎం కొంత నీరసంగా ఉన్నప్పటికీ కార్యక్రమాన్ని కొనసాగించారు.
అసెంబ్లీ సమావేశాలు గత గురువారం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆ తర్వాత ఆయన నిర్విరామంగా పనిచేస్తూ ఉండటం వల్ల కొంత ఒత్తిడి, ఆందోళనతో కూడా ఉన్నారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) రోజూవారీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నతాధికారులతో పలు సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో కూడా సీఎం పాల్గొని ప్రసంగించారు.