• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా క్రికెటర్ జోగిందర్‌ శర్మ

టీమిండియా క్రికెటర్ జోగిందర్ శర్మ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లతో పాటు దేశవాలీ క్రికెట్‌కు ఆయన గుడ్ బై చెప్పారు. శుక్రవారం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)కు జోగిందర్ శర్మ తన రిటైర్మెంట్ లేఖను పంపాడు. ఇన్నిరోజులూ తనకు సహకరించిన బీసీసీఐకి, హర్యానా క్రికెట్ అసోసియేషన్‌కు, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిప...

February 3, 2023 / 04:37 PM IST

ముగిసిన కళాతపస్వి కె.విశ్వనాథ్‌ అంత్యక్రియలు

టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్, కళాతపస్వి కె.విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. పంజాగుట్ట శ్మశానవాటికలో ఆయన కుటుంబీకులు, సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుముందుగా ఫిలిం చాంబర్‌లో కె.విశ్వనాథ్ పార్థీవదేహాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. భారీ సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి కె.విశ్వనాథ్‌కు నివాళులు అర్పించారు. అభిమానులు భారీగా తరలివచ్చి అంతిమ...

February 3, 2023 / 04:05 PM IST

విశ్వనాథ్ భౌతికకాయానికి రాజమౌళి, కీరవాణి నివాళులు

కళా తపస్వి, సీనియర్ దర్శకులు కే విశ్వనాథ్ మృతితో సినీలోకం దిగ్భ్రాంతికి లోనయింది. సినీ ప్రముఖులంతా విశ్వనాథ్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. విశ్వనాథ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 92. విశ్వనాథ్ భౌతికకాయానికి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి నివాళులు అర్పించారు. అంతకుముందే మెగాస్టార్ చిరంజీవి విశ్వనాథ్ భౌతికకాయాన...

February 3, 2023 / 02:44 PM IST

అసెంబ్లీలో అరుదైన దృశ్యాలు.. కేటీఆర్, ఈటల నవ్వులు

తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా అరుదైన దృశ్యం కనిపించింది. రాజకీయపరంగా బద్ధ శత్రువులుగా ఉంటున్న వారు కలిసి మాట్లాడుకున్నారు. సరదాగా మాట్లాడుతూ నవ్వులు పంచుకున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరస్పరం మాట్లాడుకున్నారు. ఇటీవల హుజురాబాద్ లో తాను పర్యటిస్తే ఎందుకు పాల్గొనలేదని కేటీఆర్ ఈటలను ప్రశ్నించారు.. దీనికి ఈటల సరదాగా సమాధానం ఇవ్వడంతో నవ్వులు విరబూశాయి. గ...

February 3, 2023 / 02:18 PM IST

వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పాల ధర

పాల వినియోగదారులకు అమూల్ సంస్థ మరోసారి షాకిచ్చింది. కొన్నాళ్లుగా పాల ధరను పెంచుతున్న అమూల్ తాజాగా మరోసారి పెంచేసింది. అన్ని రకాల పాలపై ధరలు పెంచుతున్నట్లు అమూల్ బ్రాండ్ సంస్థ ‘గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ప్రకటించింది. గుజరాత్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాల ధరలు పెరుగుతాయని గురువారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. లీటర్ పాలపై రూ.3 వరకు పెంచినట్లు అమూల్ సంస్థ...

February 3, 2023 / 02:02 PM IST

పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ సరికొత్త రికార్డులు!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ రికార్డులు బద్దలు కొట్టింది. బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వస్తున్న ఈ టాక్ షో పలు గత రికార్డులను పవర్ స్టార్ షో దాటేసింది. ఈ ఎపిసోడ్ ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్‌ను ఆహాలో క్రాస్ చేసిందట. ప్రభాస్ ఎపిసోడ్ రికార్డును బ్రేక్ చేసి, ఫాస్టెస్ట్‌గా నిలిచింది. వెండితెర మీద మాత్రమే కాకుండా ఓటీటీలోను పవన్ కళ్యాణ్ రికార్డుల...

February 3, 2023 / 01:58 PM IST

తప్పులను గవర్నర్ తో చదివించారు: ఈటల రాజేందర్

మూడేండ్ల తర్వాత గవర్నర్ ప్రసంగంతో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం ప్రసంగం చేశారు. దేశానికి తెలంగాణ పాలన ఆదర్శంగా నిలుస్తోందని ప్రసంగంలో గవర్నర్ తెలిపారు. అనేక మలుపులు తిరిగిన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా మొదలుకావడం విశేషం. అయితే గవర్నర్ ప్రసంగాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ప్రభుత్వం అనేక తప్పులను గవర్నర్ ప్రసంగం ద్వారా...

February 3, 2023 / 01:43 PM IST

విపక్షాల పట్టు.. రెండో రోజు స్తంభించిన పార్లమెంట్

అదానీ గ్రూప్‌ పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక వ్యవహారం పార్లమెంట్ ను వీడడం లేదు. ఆ వ్యవహారంపై చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు రెండు రోజు కూడా ఆందోళన చేశాయి. అదానీ గ్రూపుపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై సభలో చర్చించాల్సిందేనంటూ విపక్షాలు పట్టుబట్టాయి. వీరి ఆందోళనతో ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. చదవండి: పుట్టుక నీది.. చావు నీది అంటూ త...

February 3, 2023 / 01:04 PM IST

మా పార్టీలోకి మీ ఎమ్మెల్యే..: వైసీపీకి అఖిలప్రియ హెచ్చరిక

నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి పైన మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రవి టీడీపీలో చేరేందుకు ప్లాట్‌ఫామ్ సిద్ధం చేసుకుంటున్నారని సంచలన ఆరోపణ చేశారు. తమ పార్టీ నేతలతో ఆయన టచ్‌లో ఉన్నారని, కానీ తాము ఈ నెల 4న ఆయన అక్రమాలు అన్నింటిని ఆధారాలతో సహా బయటపెడతామని హెచ్చరించారు. మాపై ఏవైనా ఆరోపణలు చేసేముందు, అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆధారాలు తీసుకు రావ...

February 3, 2023 / 01:01 PM IST

పుట్టుక నీది.. చావు నీది అంటూ తెలంగాణ గవర్నర్ ప్రసంగం

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎన్నో మలుపులు తిరిగిన బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రశాంతంగా మొదలయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. ప్రజాకవి, స్వాత్రంత్య సమరయోధుడు కాళోజీ నారాయణ రావు చెప్పిన ‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ అనే పంక్తులను ఉటంకిస్తూ గవర్నర్ ప్రసంగం చేశారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ప్రసంగంలో గవర్నర్ ప...

February 3, 2023 / 12:41 PM IST

కోటంరెడ్డి భుజాలపై చంద్రబాబు తుపాకి: కాకాని

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భుజాలపై తుపాకి పెట్టి జగన్‌ను టార్గెట్ చేస్తున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. పార్టీ మారాలనుకోవడం కోటంరెడ్డి వ్యక్తిగతమన్నారు. కానీ వైసీపీపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. కారణాలు వెతికి మరీ టీడీపీకి మేలు చేసేలా ఆయన వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ ఎ...

February 3, 2023 / 12:34 PM IST

బ్రేకింగ్: సీబీఐ ఎదుటకు సీఎం జగన్ ఓఎస్డీ, నవీన్

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విచారణ అనంతరం సీబీఐ దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, జగన్ కు అత్యంత సన్నిహితుడు నవీన్ కు సీబీఐ నోటీసులు అందించిన విషయం తెలిసిందే. తాజాగా వారిద్దరూ శుక్రవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. చదవండి: అలా చేస్తే 2030 కల్లా […]

February 3, 2023 / 12:22 PM IST

అలా చేస్తే 2030 కల్లా భారతదేశం దివాళా: హర్యానా సీఎం

ఒక కార్యక్రమం అమలు చేస్తే 2030 సంవత్సరం వరకు భారతదేశం దివాళా తీస్తుందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఒక వాట్సప్ సందేశం ద్వారా తెలిసిందని పేర్కొన్నారు. అందుకనే ఆ పద్ధతి అమలు చేయట్లేదని ప్రకటించారు. ఆయన పాత పింఛన్ విధానం (ఓపీఎస్)పై మాట్లాడారు. పాత పింఛన్ విధానం అమలు చేయొద్దని కోరారు. చండీగడ్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఖట్టర్ ఓపీఎస్ పై విధానంపై మాట్...

February 3, 2023 / 12:09 PM IST

నన్ను ఎన్‌కౌంటర్ చేయండి: ఊగిపోయిన కోటంరెడ్డి

తన గొంతు ఆగాలంటే తనను ఎన్‌కౌంటర్ చేయడం ఒక్కటే పరిష్కారమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అరెస్టుకు రంగం సిద్ధమంటూ లీకులు ఇవ్వడం ఏమిటని నిలదీశారు. ఎవరైనా అధికార పార్టీలోకి వెళ్లాలని చూస్తారని, కానీ తాను మాత్రం అధికార పార్టీకి దూరం అవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. చివరి వరకు పార్టీలో ఉండి నామినేషన్లకు ముందు రోజు మోసం చ...

February 3, 2023 / 12:08 PM IST

సచివాలయంలో ‘మంటలు’.. రేవంత్, బండి ఏమన్నారంటే..

హైదరాబాద్ నడిబొడ్డున అమెరికాలోని వైట్ హౌస్ మాదిరి నిర్మాణమవుతున్న తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయంలో మంటలు వ్యాపించడంపై రాజకీయ వివాదం చెలరేగింది. ఈ సంఘటన చెలరేగడం దురదృష్టకరమని ప్రతిపక్ష పార్టీలు తెలిపాయి. ఈ ఘటనపై వెంటనే విచారణ చేసి వాస్తవాలు ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తీరుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. స...

February 3, 2023 / 11:39 AM IST