»Elephant Attack Jharkhand Three Days 10 Members Died
Elephant attacks: ఏనుగుల దాడిలో 3 రోజుల్లో 10 మంది మృతి
జార్ఖండ్ రాంచీ జిల్లాలోని పలు గ్రామాల్లో ఏనుగుల దాడులతో మూడు రోజుల్లో 10 మంది మరణించారు. ఈ క్రమంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అక్కడి అధికారులు సూచించారు.
జార్ఖండ్(jharkhand)లోని పలు గ్రామాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జార్ఖండ్‌లో గత మూడు రోజుల్లో ఏనుగుల దాడి(elephant attack)లో దాదాపు 10 మంది(10 members died) ప్రాణాలు కోల్పోయారు. రాంచీ జిల్లాలోని ఓ గ్రామంలో ఏనుగు దాడి చేసిన మరొక ఘటన వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు మంగళవారం తెల్లవారుజామున ఓ ఏనుగుల మంద బోరెయా గ్రామంలోకి ప్రవేశించి సుఖ్బీర్ కిడో అనే 55 ఏళ్ల రైతును తొక్కి చంపింది. ఆ క్రమంలో గ్రామస్థులు ఏనుగును తరిమికొట్టినప్పుడు, అది సమీపంలోని ఘర్గావ్కు చేరుకుంది. ఆ నేపథ్యంలో ఏనుగులు పునై ఓరాన్, గోవింద ఒరాన్, రఖ్వా దేవి అనే ముగ్గురు వ్యక్తులను చితకబాది చంపాయని స్థానికులు పేర్కొన్నారు. ఈ దాడిలో మరో గ్రామస్థుడు తీవ్రంగా గాయపడి చికిత్స కోసం రాంచీలోని రిమ్స్‌లో చేరాడు. ఏనుగు గర్గావ్లో సంచరిస్తున్నట్లు కనిపించిందని, అటవీ శాఖ ఒక బృందాన్ని తరలించిందని అధికారులు తెలిపారు. మరోవైపు ఏనుగులను తిరిగి అడవికి తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నామని, గ్రామస్థులు ఇళ్లలోనే ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా ఒక్కొక్కరికి రూ.25 వేలు, ఒక్కో బాధిత కుటుంబానికి రూ.3.75 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని డీఎఫ్‌వో(DFO) తెలిపారు. భాంద్రా, కుడు ప్రాంతాల్లో ఏనుగుల(elephants group) సంచారం ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రజలకు ఏనుగులతో వ్యవహరించడంపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. వారు ఉత్సాహంలో ఆ జంతువులను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తే అవి వాటి రక్షణ కోసం దాడి చేసే అవకాశం ఉందని అటవీ అధికారులు తెలిపారు.
మరోవైపు ఏనుగుల దాడుల్లో(elephant attacks) గత ఐదేళ్లలో(last 5 years) జార్ఖండ్‌లో 462 మంది మరణించారని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ మంత్రి సత్య ప్రకాష్ తెలిపారు. 2021-22లో 133 మంది మరణించారని, 2020-21లో ఆ సంఖ్య 84కి చేరుకుందని, 2021-22లో 133 మంది మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి.