»There Is No Unemployment Allowance Of Rs 6 Thousand From The Central Government Pib Clarity On Fake News
Central Government: రూ.6 వేల నిరుద్యోగ భృతిపై పీఐబీ క్లారిటీ
ప్రధాన మంత్రి బేరోజ్గారి భత్తా యోజన కింద దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్రం ప్రతి నెల రూ.6,000 భృతిగా ఇస్తోందని సామాజిక మాధ్యమాల్లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. కొందరైతే అప్లై చేసుకోవడానికి ఫేక్ లింకులు కూడా పెడుతున్నారు. ఈనేపథ్యంలోనే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ఈ వ్యవహారంపై ఫ్యాక్ట్ చెక్ చేసి ఆ వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అలాంటి వార్తలను గుడ్డిగా నమ్మి ఇతరులకు షేర్ చేయకూడదని కోరింది.
సోషల్ మీడియా(social media) వచ్చినప్పటి నుంచి సమాచారం(information) బదిలీ చేయబడినంత వేగంగా ఫేక్ న్యూస్(fake news) కూడా అంతే స్పీడుగా ట్రాన్స్ ఫర్ అవుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల పేరుతో నెటిజన్లను మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ మోసపూరిత వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం(Central government) రూ.6000 స్టైపెండ్(unemployment allowance) ఇస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈ వార్త వాట్సాప్లో వైరల్(viral)గా మారింది.
అర్హత గల అభ్యర్థులు ఈ స్కాలర్షిప్ ప్రధాన మంత్రి బెరోజ్గర్ భట్ యోజన పథకం క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని కోరుతున్నారు. దీని కోసం ఒక లింక్ కూడా షేర్ చేయబడుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజం లేదని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) ఈ వ్యవహారంపై ఫ్యాక్ట్ చెక్(fact check) చేసి ట్విట్టర్ (twitter) ద్వారా అధికారికంగా ఇటీవల వెల్లడించింది. భారత ప్రభుత్వం అటువంటి పథకాన్ని అమలు చేయనందున ఈ సందేశాన్ని ఫార్వార్డ్ చేయవద్దని సూచించింది. అసలు ఈ ప్రచారంలో వాస్తవం లేదని, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని ఇప్పటివరకు తీసుకురాలేదని చెప్పింది.
ఇదిలా ఉండగా PIB నకిలీ పథకాల గురించి వాస్తవ తనిఖీ ద్వారా తెలియజేయడం ఇదేం మొదటిసారి కాదు. అంతకుముందు కూడా ప్రధాన్ మంత్రి నారీ శక్తి యోజన’ కింద కేంద్ర ప్రభుత్వం మహిళలందరికీ 2 లక్షల 20 వేల రూపాయలు ఇస్తుందని ఫేక్ వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఆ వైరల్ వార్తలను కూడా PIB ఖండించింది. ఈ వార్తల్లో నిజం లేదని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ క్రమంలో సోషల్ మీడియా(social media)లో వైరల్ అయ్యే ప్రతి వార్తను గుడ్డిగా నమ్మవద్దని, నిజానిజాలు తెలుసుకోకుండా ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని అధికారులు ప్రజలకు సూచించారు.