Seema Haider: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు మోదీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సీమా హైదర్ స్పందించారు. సీఏఏ అమలును స్వాగతిస్తున్నట్లు తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించింది. ఇచ్చిన మాటను మోదీ నిలబెట్టుకున్నారంది. భారత ప్రభుత్వం ఈ రోజు దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసింది.
సీఏఏ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన చూశాక చాలా సంతోషం అనిపించింది. ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము. నిజంగా మోదీ జీ చేసిన మాట నిలబెట్టుకున్నారు. నా జీవితాంతం వారికి రుణపడి ఉంటాను. ఈ చట్టంతో మేం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, నాకు భారత పౌరసత్వం వచ్చేందుకు ఈ చట్టం తోడ్పడుతుందని నమ్ముతున్నానని సీమా హైదర్ ఒక వీడియో రూపంలో తెలిపింది. ఈమేరకు సీఏఏ అమలు చేసినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.