»Dastgiris Petition In Cbi Court For Protection As There Is Danger To Life From Jagan
Dastgiri: జగన్ నుంచి ప్రాణ హాని ఉంది.. రక్షణ ఇవ్వండి
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి సీబీఐ కోర్టులో ప్రొటెక్షన్ పిటిషన్ దాఖలు వేశారు. ప్రాణహాని ఉందంటూ, తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ కోరారు.
Dastgiri's petition in CBI court for protection as there is danger to life from Jagan.
Dastgiri: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి(Vivekananda Reddy) హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి(Dastgiri) ప్రాణహాని ఉందంటూ అధికారులకు లేఖ రాశారు. మంగళవారం ఉదయం సీబీఐ కోర్టు( CBI court)లో ప్రొటెక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. దస్తగిరికి, ఆయన కుటుంబానికి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని, అందుకు సంబంధించిన ఆదేశించాలని ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. తన కుటుంబం మొత్తానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన సతీమణి భారతి, అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆయన కుమారుడు చైతన్య రెడ్డి నుంచి ప్రాణ హాని ఉందని పిటిషన్ దాఖలు చేశాడు. సీబీఐ తన కుటుంబానికి రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని అందులో కోరారు. ఈయన ఇచ్చిన పిటిషన్‌పై మధ్యాహ్నం సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.