»60 Mps Vande Bharat Trains For Their Constituency Letter To Railway Department
Vande Bharat Trains: తమ ప్రాంతానికి కావాలని 60 మంది ఎంపీల లేఖ
దేశంలో ఇటీవల ప్రారంభమైన వందేభారత్ రైళ్లకు క్రమంగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రారంభం కాగా...60 మంది ఎంపీలు తమ నియోజకవర్గాలకు కూడా ఈ ట్రైన్స్ కావాలని రైల్వే శాఖకు లేఖలు రాశారు. కోరిన వారిలో బీజేపీకి చెందిన వారు ఎక్కువగా ఉండగా, విపక్ష ఎంపీలు 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
స్వదేశీ పరిజ్ఞానంతో దేశంలో తయారైన వందే భారత్ రైళ్ల(vande bharat trains)కు డిమాండ్ పెరిగింది. అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించిన ఈ ట్రైన్లకు మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతోపాటు ఇప్పటికే ఈ రైళ్లు 10 రూట్లలో దాదాపు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాల నుంచి 14 మంది ఎంపీలతో సహా 60 మంది పార్లమెంటు సభ్యులు(60 mps) తమ నియోజకవర్గాలకు(their constituency) కూడా ఈ ట్రైన్లు కావాలని రైల్వే శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. డిమాండ్ చేస్తున్న వారిలో అధికార బీజేపీ(bjp) ఎంపీలతోపాటు 14 మంది విపక్ష పార్టీల నేతలు కూడా ఉన్నట్లు తెలిసింది. షోలాపూర్- ముంబై మధ్య ఈ రైలును నడపాలని సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌తో సహా బీజేపీ ఎంపిల నుంచి చాలా పిటిషన్లు వచ్చాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ధార్వాడ్ నుంచి బెంగళూరుకు వందే భారత్ రైలు, గ్వాలియర్‌కు రైలు కోసం పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అభ్యర్థించారు.
ప్రస్తుతం నడుస్తున్న 10 వందే భారత్ రైళ్లలో, బిలాస్పూర్-నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్(vande bharat express) ఈ ఆర్థిక సంవత్సరం జనవరి వరకు అత్యల్ప ఆక్యుపెన్సీని కలిగి ఉండగా, ముంబై-గాంధీనగర్ మార్గం అత్యధికంగా నమోదైంది. మరోవైపు బిలాస్పూర్-నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 55 శాతం ఆక్యుపెన్సీ రేటు ఉండగా, ముంబై-గాంధీనగర్ మధ్య నడిచే రైలు 126 శాతం ఆక్యుపెన్సీ(occupancy) రేటును నమోదు చేసింది. ప్రతిపక్ష పార్టీలలో, ఎన్సీపీ, డీఎంకె, ఎస్పీ, ఆప్, జేడీ(యు)లకు చెందిన ఒక్కొక్క ఎంపీ తమ నియోజకవర్గాలకు అలాంటి రైళ్లు కావాలని డిమాండ్(demand) చేశారు. ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు, సీపీఐ(ఎం), వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు కూడా డిమాండ్ చేసిన వారిలో ఉన్నారు. ఇతర పార్టీ ఎంపీలు అప్నా దళ్, శివసేన నుంచి కూడా ఒక్కొక్కరు స్వదేశీ రైళ్లను కోరారు.
ప్రస్తుతం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు(vande bharat express train) ప్రయాణికులకు(passengers) మెరుగైన ప్రయాణాన్ని అందిస్తుంది. రైలులో ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, టచ్-ఫ్రీ స్లైడింగ్ డోర్లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో రివాల్వింగ్ సీట్లు, ప్రతి కోచ్‌లో 32 అంగుళాల ప్యాసింజర్ సమాచారం, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఇది కాకుండా, రైలులో కవాచ్, CCTVలు, మెరుగైన అగ్ని భద్రతా చర్యలు వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ రైళ్లు గంటకు 160 కి.మీ(160 kmph) వేగాన్ని అందుకోవడానికి కేవలం 129 సెకన్లు పడుతుంది.