వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్(Vande Bharat trains) ప్రయాణీకులకు సమయానికి అందుబాటులో ఉండే విధంగా రైల్వే శాఖ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రైళ్లను 14 నిమిషాల్లోనే శుభ్రం(cleaning) చేసి తర్వాత ప్రయాణానికి సిద్ధం చేయనున్నట్లు తెలిపింది.
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల(Vande Bharat trains) గురించి సరికొత్త అప్ డేట్ వచ్చింది. ఇకపై ఈ ట్రైన్లు 14 నిమిషాల్లోనే పూర్తిగా శుభ్రం చేసి తదుపరి ప్రయాణానికి సిద్ధం చేస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే “14 మినిట్ మిరాకిల్”(14 minutes miracle) అని పేరు పెట్టబడిన ఈ కార్యక్రమం ఆదివారం 29 ప్రదేశాలలో ప్రారంభించబడుతుందని, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో ప్రారంభించనున్నట్లు తెలిపింది.
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9 కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల(Vande Bharat trains)ను దేశానికి అంకితం చేశారు. దీంతో ప్రస్తుతం దేశంలో మొత్తం వందే భారత్ రైళ్ల సంఖ్య 34కి చేరింది. అయితే ఈ రైళ్లు బయలుదేరడంతోపాటు తిరిగి ప్రయాణించడంలో కూడా ఖచ్చితత్వం రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్తగా “14 నిమిషాల అద్భుతం” కార్యక్రామానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ప్రెస్ను శుభ్రం చేసి తదుపరి ప్రయాణానికి సిద్ధం చేయడానికి దాదాపు 45 నిమిషాల సమయం పడుతుంది. కానీ జపాన్ దేశంలో సూపర్ ఫాస్ట్ రైళ్లను 7 నిమిషాల్లోనే క్లీన్ చేస్తున్నారని, ఆ దేశం నుంచి ఈ విధానాన్ని తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
అయితే ఈ క్లీనింగ్ విధానంలో ప్రయాణీకులందరూ సకాలంలో స్టేషన్లో దిగినట్లు నిర్ధారించుకున్న తర్వాత 14 నిమిషాల అద్భుతం కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి ఫ్లో చార్ట్ ఆధారంగా ఇది పని చేస్తుందన్నారు. దీంతోపాటు ఈ క్లీనింగ్(cleaning)కార్యకలాపాలు, తదుపరి విశ్లేషణ గురించి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటామన్నారు. ఒక నెల తర్వాత ఈ స్కీమ్ మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.