»Pm Modi Launches 10 New Vande Bharat Trains Today
Vande Bharat : సికింద్రాబాద్-విశాఖ మార్గంలో మరో వందేభారత్ రైలు
వందే భారత్ రైళ్ల సంఖ్యను క్రమంగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా మంగళవారం మరో వందే భారత్ రైలు సికింద్రాబాద్- విశాఖపట్నంల మధ్య పరుగులు పెట్టేందుకు ప్రారంభమైంది.
Vande Bharat : ఈ మధ్య కాలంలో వందే భారత్ రైళ్ల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం క్రమంగా పెంచుతోంది. విశాఖపట్నం – సికింద్రాబాద్ మధ్య పరుగులు తీసేందుకు నేడు మరో వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మంగళవారం ఆయన కొత్తగా 10 వందే భారత్ రైళ్లను(Vande Bharat trains) ప్రారంభించారు. కలబురగి – బెంగళూరు మార్గంలో కొత్త ఎక్స్ప్రెస్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. తర్వాత పది వందే భారత్ రైళ్లను వర్చువల్గా ప్రారంభించారు.
ఈ 10 వందే భారత్ రైళ్లలో(Vande Bharat) దక్షిణ మధ్య రైల్వేకు రెండు కేటాయించారు. వాటిలో ఒకటి సికింద్రాబాద్- విశాఖపట్నంల మధ్య పరుగులు పెట్టనుంది. ఈ పది వందే భారత్ రైళ్లను కలుపుకుంటే దేశంలో వీటి సంఖ్య 51కి చేరింది. మంగళవారం ప్రారంచిన మెట్రో రైళ్లు సికింద్రాబాద్- విశాఖ, కలబురగి-బెంగళూరు, లక్నో-డెహ్రాడూన్, న్యూజల్పాయ్ గుడి -పాట్నా, పూరి- విశాఖపట్నం, రాంచీ-వారణాసి, ఖజరహో-ఢిల్లీ, అహ్మదాబాద్-ముంబయి, మైసూర్-చెన్నై మార్గాల్లో పట్టాలపై పరుగులు తీయనున్నాయి.
దేశం మొత్తం మీద ఇప్పుడు వందే భారత్ రైళ్లు 45 రూట్లలో పరుగులు పెడుతూ ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. అత్యధికంగా ఢిల్లీ స్టేషన్కు పది వందే భారత్లు రాకపోకలు సాగిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త రైళ్లను(trains) తీసుకొచ్చి మెరుగైన సౌకర్యాలు అందించేందుకు రైల్వే శాఖ కసరత్తులు చేస్తోంది.