»The Poco C55 Series That Came To The Market Do You Know The Price
POCO C55: మార్కెట్లోకి వచ్చిన పోకో సీ55 సిరీస్..ధరెంతో తెలుసా?
భారత మార్కెట్లోకి 10 వేల రూపాయాల్లోపే అద్భుతమైన ఫోన్ అందుబాటులోకి వచ్చింది. POCO C55 స్మార్ట్‌ఫోన్ రూ. 9,499 వద్ద ప్రారంభమైంది. 50MP డ్యూయల్ కెమెరా, 5,000mAh బ్యాటరీ, MediaTek Helio G85 చిప్సెట్ వంటి మంచి ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది.
దేశీయ మార్కెట్లోకి మరో సరికొత్త POCO C55 మోడల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అనేక ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ 10 వేల రూపాయల లోపే లభించడం విశేషం. కానీ 5జీ నెట్ వర్క్ సపోర్ట్ ఇందులో లేదని చెప్పవచ్చు. ఇక ఈ ఫోన్ ఫీచర్ల గురించి ఇప్పుడు చుద్దాం. POCO C55 మూడు రంగులలో లభిస్తుంది. ఫారెస్ట్ గ్రీన్, కూల్ బ్లూ, పవర్ బ్లాక్. 50 మెగా పిక్సెల్ కెమెరా, 10 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి సౌకర్యాలతో వస్తోంది. ఇది పలు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4GB + 64GB, 6GB + 128GB. వీటి ధరలు వరుసగా రూ.9,499, రూ.10,999గా ప్రకటించారు. ఇది ఫిబ్రవరి 28 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది.
POCO దాని C-సిరీస్ పోర్ట్‌ఫోలియోతో పోలిస్తే రూ.10 వేల కంటే తక్కువ విభాగంలో అందించే అద్భుతమైన మోడల్ ఫోన్ ఇది అని POCO ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షూ తెలిపారు. ఇది గేమ్ ఛేంజర్లకు మంచి అనుభూతినిచ్చే మోడల్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
POCO C55 మోడల్ ఫోన్లో MediaTek Helio G85 చిప్సెట్, G52 GPU, 1GHz, 5GB టర్బో RAM, 50MP డ్యూయల్ కెమెరా సెటప్, సెల్ఫీల 5MP, ఫ్రంట్ స్నాపర్, 5000mAh బ్యాటరీని, 10W ఛార్జింగ్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.
POCO 4GB+64GB వేరియంట్‌పై రూ.500 మొదటి రోజు ఫ్లాట్ తగ్గింపును ప్రవేశపెట్టింది. అలాగే SBI, HDFC, ICICI డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే వినియోగదారుల కోసం వరుసగా 4GB + 64GB, 6GB + 128GB వేరియంట్లపై రూ. 500, రూ.1,000 బ్యాంక్ ఆఫర్లను ప్రకటించింది.