Share Market Opening: దేశీయ మార్కెట్ బుధవారం వరుసగా ఏడో రోజు నష్టాల బాటలో పయనిస్తోంది. ప్రధాన సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు ఈరోజు కూడా నష్టాల్లోనే ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గత వారం నుంచి మార్కెట్‌పై ఒత్తిడి కొనసాగుతోంది. ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్ దాదాపు 170 పాయింట్ల నష్టంతో 65,775 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. అలాగే నిఫ్టీ కూడా 40 పాయింట్లకు పైగా పతనమై 19,620 పాయింట్ల వద్దకు చేరుకుంది. మార్కెట్ ప్రారంభానికి ముందు నిఫ్టీ ఫ్యూచర్స్ గిఫ్టీ సిటీలో దాదాపు స్థిరంగా ఉన్నాయి. కాగా, ప్రీ-ఓపెన్ సెషన్లో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ స్వల్ప నష్టాల్లోనే ఉన్నాయి.
నిన్న అంటే మంగళవారం దేశీయ మార్కెట్ వరుసగా ఆరో రోజు క్షీణించింది. మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 80 పాయింట్లు పతనమై 65,925 పాయింట్ల దగ్గర ముగిసింది. కాగా నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల నష్టంతో 19,637 పాయింట్ల దగ్గర ఉంది. గత వారం సోమవారం నుంచి మార్కెట్ ప్రతి సెషన్లోనూ పతనమవుతోంది. గత వారం సెన్సెక్స్ , నిఫ్టీ రెండు సూచీలు ఒక్కొక్కటి రెండున్నర శాతానికి పైగా పడిపోయాయి. అమెరికన్ మార్కెట్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ మంగళవారం 1.14 శాతం పడిపోయింది. నాస్డాక్ కాంపోజిట్ ఇండెక్స్‌లో 1.57 శాతం క్షీణత కనిపించగా, S&P 500 ఇండెక్స్‌లో 1.47 శాతం క్షీణత కనిపించింది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు మిశ్రమ ధోరణిని కనబరుస్తున్నాయి. డే ట్రేడింగ్‌లో జపాన్‌కు చెందిన నిక్కీ 0.47 శాతం నష్టాల్లో ఉండగా, హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్ సెంగ్ 0.69 శాతం బలపడింది. చైనా షాంఘై కాంపోజిట్ కూడా 0.27 శాతం పెరిగింది.
ప్రారంభ ట్రేడింగ్‌లో చాలా పెద్ద స్టాక్‌లు పడిపోయాయి. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 9 మాత్రమే గ్రీన్ జోన్లో ఉండగా, 21 పడిపోయాయి. ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి షేర్లు స్వల్ప పెరుగుదలలో ఉన్నాయి. మరోవైపు టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ మహీంద్రా వంటి షేర్లు పతనమవుతున్నాయి.