Kriti Sanon: మధుబాలలా… షెహజాదా హీరోయిన్‌కు క్షమాపణ చెప్పిన శ్రేయాస్, ఎందుకంటే?
అందాల తార కృతి సనన్ (Kriti Sanon) 'షెహజాదా' (Shehzada) సినిమా ఈ నెల 17వ తారీఖున విడుదలైంది. రోహిత్ ధావన్ (Rohit Dhawan) దర్శకత్వంలో ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ కు జోడీగా నటించింది కృతి. ఈ సినిమాలో హీరోయిన్ నటనకు గాను నటుడు శ్రేయాస్ తల్పడే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రశంసల వర్షం కురిసింది. దీనికి కృతి థ్యాంక్స్ చెప్పింది. అయితే అది తన ట్విట్టర్ ఖాతా కాదంటూ.. కృతికి సారీ చెప్పారు శ్రేయాస్. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.
అందాల తార కృతి సనన్ (Kriti Sanon) ‘షెహజాదా’ (Shehzada) సినిమా ఈ నెల 17వ తారీఖున విడుదలైంది. రోహిత్ ధావన్ (Rohit Dhawan) దర్శకత్వంలో ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ కు జోడీగా నటించింది కృతి. ఈ సినిమాలో హీరోయిన్ నటనకు గాను నటుడు శ్రేయాస్ తల్పడే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రశంసల వర్షం కురిసింది. దీనికి కృతి థ్యాంక్స్ చెప్పింది. అయితే అది తన ట్విట్టర్ ఖాతా కాదంటూ.. కృతికి సారీ చెప్పారు శ్రేయాస్. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.
శ్రేయాస్ తల్పడే పేరుతో ఉన్న ఓ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఓ అభిమాని స్పందిస్తూ… ఇప్పుడే కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ నటించిన షెహజాదా సినిమాను చూశానని, ఇందులో కృతి నటన చూశాక దేశంలో నెక్స్ట్ మధుబాల వలె కనిపిస్తోందని ప్రశంసించారు.
ఇది నటుడు శ్రేయాస్ తల్పడే ట్విట్టర్ హ్యాండిల్గా భావించిన కృతి సనన్.. అంతటి హీరోయిన్‌తోనా… అయినా మధుబాలతో పోల్చినందుకు థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశారు. దీనికి శ్రేయాస్ స్పందించారు.
డియర్ కృతి సనన్.. మీకు ప్రశంసలతో కూడిన ట్వీట్ నాది కాదు, తన పేరు మీద ఉన్న ఫేక్ అకౌంట్ నుండి ఈ ట్వీట్ చేశారు, ఇందుకు నేను సారీ చెబుతున్నాను అంటూ పేర్కొన్నారు. ఆ తర్వాత షెహజాదీ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమంటే నటుడు శ్రేయాస్ తల్పడే ట్విట్టర్ హ్యాండిల్‌కు బ్లూ-టిక్ ఉంది. అలాగే మధుబాలతో పోల్చుతూ పొగిడిన ట్విట్టర్ హ్యాండిల్‌కు కూడా బ్లూ-టిక్ ఉంది. దీనిపై శ్రేయాస్… ట్విట్టర్ సపోర్ట్ కు సమాచారం అందించారు.