»Actress Alia Bhatt Fire On Shooting At Neighbor Building Terrace
Actress ఆలియా భట్ కు చేదు అనుభవం.. రహాస్యంగా కెమెరాతో
విషయం తెలుసుకున్న ఆమె ఇన్ స్టాగ్రామ్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఆమె చేసిన పోస్టుకు విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, జాన్వీ కపూర్, అర్జున్ కపూర్ తదితరులు మద్దతు నిలిచారు. తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని పంచుకున్నారు. వ్యక్తిగత గోప్యత పాటించరా అని మండిపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అసలు ఏం జరిగిందంటే..?
సినీ నటీనటుల (Cine Actors and Actress) విషయాలు అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తి కనపరుస్తున్నారు. వారి వ్యక్తిగత, వృత్తిగత విషయాలు తెలుసుకునేందుకు ఆరాట పడుతుంటారు. ఇక వాళ్లు కనుక కనిపిస్తే చొక్కాలు చిప్పుకుంటారు. అంతలా అభిమానం చూపిస్తారు. అయితే ఆ అభిమానం శ్రుతిమించుతోంది. వారి గురించి తెలుసుకునేందుకు మరి వ్యక్తిగతం (Personal)గా వెళ్తున్నారు. వారి వ్యక్తిగత జీవితంలో తొంగి చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. సినీ నటీనటుల ఇళ్లకు చేరుకుని రచ్చ చేస్తున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ (RRR) హీరోయిన్, బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt)కు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఆమెకు తెలియకుండా ఇంటి వద్దకు వచ్చి రహాస్యంగా వీడియో, ఫొటోలు తీశారు. విషయం తెలుసుకున్న ఆమె ఇన్ స్టాగ్రామ్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఆమె చేసిన పోస్టుకు విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ (Anushka Sharma), జాన్వీ కపూర్ (Jhanvi Kapoor), అర్జున్ కపూర్ (Arjun Kapoor) తదితరులు మద్దతు నిలిచారు. తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని పంచుకున్నారు. వ్యక్తిగత గోప్యత పాటించరా అని మండిపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అసలు ఏం జరిగిందంటే..?
‘మీరు ఆట పట్టిస్తున్నారా? నేను ప్రశాంతంగా ఇంటి వద్ద కుటుంబంతో ఉంటున్నా. ఎవరో నన్ను గమనిస్తున్నారని అనిపించింది. తీరా పక్కకు చూస్తే ఎవరో ఇద్దరు మా పక్క ఇంటి పైనుంచి కెమెరాతో నన్ను వీడియో తీస్తున్నారు. ఇది సరైనదేనా.? ఒకరి వ్యక్తిగత విషయాలపై గోప్యత పాటించరా?’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఎవరి మధ్య అయినా ఓ గీత ఉంటుంది. మీరు ఈ రోజు ఆ గీత దాటారు. మీరు మీ హద్దులు దాటి ప్రవర్తించారు’ అని ఆలియా వాపోయింది. ఈ సందర్భంగా ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఆలియా భట్ చేసిన పోస్టుకు సినీ ప్రముఖుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. తమకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని వారు వాపోయారు.
అలియా భట్ చేసిన ప్రకటనపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. రహాస్యంగా ఫొటోలు తీయడాన్ని తప్పు బడుతున్నారు. మాకు వ్యక్తిగత గోప్యత ఉండదా? అని ప్రశ్నిస్తున్నారు. తమకు వ్యక్తిగత జీవితం ఉంటుందని పేర్కొన్నారు. ఇది గ్రహించి తమను వదిలేసి మీ పనులు చూసుకోవాలని హితవు పలికారు. ఇక బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తీవ్రస్థాయిలో స్పందించాడు. సిగ్గులేని సంఘటన ఇది అని పేర్కొన్నాడు. ఇక శ్రీదేవి కుమార్తె, హీరోయిన్ జాన్వీ కపూర్ ‘ఇది చాలా అసహ్యమైన పని. నాకు ఇలాంటి పరిస్థితి చాలా ఎదురైంది. నాకు తెలియకుండా నన్ను ఎన్నో ఫొటోలు తీశారు’ అని పేర్కొంది. ఇక విరాట్ కోహ్లీ భార్య, హీరోయిన్ అనుష్క శర్మ స్పందిస్తూ.. ‘ఇది నిజంగా సిగ్గు చేటు. మా కుమార్తె వామిక విషయంలో ఇలాంటి ఘటనలు ఎన్నో ఎదుర్కొన్నాం’ అని పంచుకుంది. కరణ్ జోహర్ కూడా ఈ సంఘటనను ఖండించారు. కాగా అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ ను 2022 ఏప్రిల్ లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.