»Salt Bae Free Food For 5 Thousand People Every Day In Turkey
salt bae: ప్రముఖ చెఫ్ ఉదారత..టర్కీలో ప్రతి రోజు 5 వేల మందికి ఫ్రీ ఫుడ్
టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు ప్రముఖ చెఫ్ నస్ర్-ఎట్ గోక్సే ప్రతి రోజు 5 వేల మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు తన ఇన్ స్టా వేదికగా వెల్లడించారు. సాల్ట్ బే(salt bae)గా ఫేమస్ అయిన ఈ చెఫ్ చేస్తున్న సాయం పట్ల పలువురు మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.
టర్కీ(Turkey), సిరియాలో ఫిబ్రవరి 6న 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ప్రభావం ఇంకా ఇరు దేశాల్లో కొనసాగుతూనే ఉంది. ఈ విపత్తు సంభవించి 10 రోజులు దాటినా కూడా ఇంకా శిథిలాల తొలగింపు ప్రక్రియను రెస్క్యూ సిబ్బంది తొలగిస్తూనే ఉన్నారు. ఇంకా శిథిలాల్లో ఎవరైనా ఉన్నారెమోనని సిబ్బంది ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ రెండు దేశాల్లో ఏర్పడిన విపత్తు కారణంగా మరణించిన వారి సంఖ్య 41 వేలు దాటింది. ఒక్క టర్కీలోనే 35 మందికిపైగా మృతి చెందారు. మరోవైపు సిరియాలో 5 వేల మందికిపైగా మృత్యుఓడికి చేరారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.
ఈ క్రమంలో ప్రతి రోజు లక్షల మంది నిరాశ్రయులుగా(earthquake victims) మారి నీరు, ఆహారం కోసం అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన వంతు సహాయంగా ప్రతి రోజు 5 వేల మందికి ఉచితంగా ఫుడ్ అందిస్తున్నట్లు ప్రముఖ చెఫ్ నస్ర్-ఎట్ గోక్సే ప్రకటించారు. సాల్ట్ బే(salt bae) అని ప్రసిద్ది చెందిన ఈ చెఫ్ తన ఇన్ స్టాగ్రామ్(instagram) ద్వారా ఈ మేరకు వెల్లడించారు. విపత్తుతో ఇబ్బందులు పడుతున్న తన దేశస్థులకు సహాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణించడానికి మొబైల్ వంటగదిని సిద్ధం చేసిన వీడియోను రిలీజ్ చేశారు. వీడియోలో, అతని ట్రక్కు రెస్టారెంట్ నుంచి వేడి వేడి ఆహారాన్ని బాధితులకు అందజేయడాన్ని వీడియోలో చూడవచ్చు. ఇక ఈ వీడియోను రెండు రోజుల క్రితం షేర్ చేయగా..ఇప్పటికే 4.7 మిలియన్ల మందికిపైగా లైక్ చేసి, ఇంకొంత మంది షేర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సాల్ట్ బే చేస్తున్న సాయం పట్ల పలువురు నెటిజన్లు(netizens) ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్షణం ప్రతి సహాయం చాలా ముఖ్యమైనదని, ఈ విపత్తులో ప్రతి ఒక్కరికీ నా ప్రార్థనలు ఉంటాయని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
చలిలో ఆశ్రయం లేదా తగినంత ఆహారం(food) లేకుండా పోరాడుతున్న ఆయా ప్రజలకు సహాయం చేయడంపై తగినంత మంది స్పందించాలని పలువురు కోరుతున్నారు. టర్కీ, సిరియా(Syria)లో సంభవించిన భూకంపం(earth quake) నేపథ్యంలో అనేక దేశాలు, సంస్థలు రెస్క్యూ కార్మికులు, అత్యవసర సామాగ్రి, ఇతర రకాల సహాయాన్ని పంపాయి. పలు దేశాల నుంచి వచ్చిన సిబ్బంది సహా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కార్యకర్తలు సహాయక చర్యలు చేపడుతున్నారు. నీరు, ఆహారం లేని వారికి ఫుడ్ అందిస్తున్నారు.