మనీల్యాండరింగ్ (Money Laundering)కు పాల్పడిన నేరానికి కోర్టు 11,196 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ముగ్గురు అన్నదమ్ముల విషయంలో తుర్కియే కోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది. థోడెక్స్ అనే పేరుతో ఫరూఖ్ ఫతిహ్ ఓజర్ అనే 29 ఏళ్ల వ్యక్తి క్రిప్టో బిజినెస్ చేస్తుండేవాడు. ఆయన మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపణలు చేసింది.
ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని, క్రిమినల్ ఆర్గనైజేషన్ కూడా ఏర్పాటు చేశారని లాయర్ వాదనలు వినిపించారు. ఓజర్ దాదాపుగా 2 బిలియన్ డాలర్ట్ ఇన్వెస్టర్ అసెట్స్‌ను తీసుకుని పరారైనట్లు వెల్లడించింది. అంతేకాకుండా దాదాపుగా 30 మిలియన్ డాలర్లను రహస్యంగా వివిధ బ్యాంకు అకౌంట్లకు తరలించినట్లుగా ప్రాసిక్యూషన్ పలు ఆరోపణలు చేయడంతో కోర్టు దీనిపై విచారించింది.
వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు ఓజర్తో పాటుగా ఆయన సోదరులు సెరప్, గువెన్ కూడా దోషులని తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో ఒక్కొక్కరికీ 11,196 సంవత్సరాలు పాటు జైలు శిక్షను విధించింది. ఈ కేసులో క్రిప్టో బిజినెస్ వ్యవస్థాపకుడికి కూడా 40,562 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరడం విశేషం. అయితే ఓజర్తో పాటుగా తన ఇద్దరు అన్నదమ్ములకు మాత్రమే కోర్టు జైలు శిక్షను ఖరారు చేస్తూ ప్రకటన చేసింది.