»Merchant Navy Sailor Indian Sailor Missing In Middle Sea
Marchant Navy Sailor: నడి సముద్రంలో భారత నావికుడు మిస్సింగ్
నౌకలో విధుల్లో ఉన్న నావికుడు అదృశ్యమయ్యారు. తుర్కియేలోని నౌకాశ్రయానికి వెళ్లే మార్గంలో నౌక నుంచి కనిపించకుండా పోయారు. ఆచూకీ లేదని నావికుడి కుటుంబం ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.
Marchant Navy Sailor: నౌకలో విధుల్లో ఉన్న నావికుడు అదృశ్యమయ్యాడు. తుర్కియేలోని నౌకాశ్రయానికి వెళ్లే మార్గంలో నౌక నుంచి ఓ నావికుడు కనిపించకుండా పోయాడు. ఆచూకీ లేదని నావికుడి కుటుంబం ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. నావికుడి మిస్సింగ్‌పై అతని కుటుంబం పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన అంకిత్ సక్లానీ ముంబాయి సంస్థ ఎల్విస్ షిప్ మేనేజ్మెంట్లో నావికుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సంస్థలో డిసెంబర్ 1వ తారీఖున చేరినట్లు అతని భార్య తెలిపింది. అయితే ఈ నెల 18వ తారీఖున తన భర్త నుంచి ఎలాంటి వివరాలు తెలియడం లేదని ఆమె తెలిపింది.
నావికుడిగా తన భర్తకు 15 సంవత్సరాల అనుభవం ఉందని తెలిపింది. ఎల్విస్ సంస్థకు చెందిన నౌకలో డిసెంబర్ 18 నాటికి అతడు తుర్కియేలోని నౌకాశ్రయానికి చేరుకోవాలి. అయితే అంతకు ముందు నుంచే నా భర్త నుంచి సందేహాలు రావడం మొదలయ్యాయని ఆమె భార్య తెలిపింది. ఉద్యోగంలో చేరిన 10 రోజులు అంతా బాగానే ఉందన్నారు. కానీ తర్వాత తిరిగి వచ్చేద్దామని అనుకుంటున్నాని తెలిపారు.
తనకు ఏదైనా జరిగితే సంస్థదే బాధ్యత కంపెనీదే అంటూ డిసెంబర్ 11న సందేశం వచ్చింది. దీంతో భార్య ముంబాయికి చెందిన సంస్థను సంప్రదించగా.. తుర్కియే చేరుకున్న తర్వాత సంప్రదించడం అవుతుందని తెలిపారు. తర్వాత అక్కడికి చేరుకోక ముందే భర్త నౌక నుంచి సముద్రంలోకి దూకేశాడని డిసెంబర్ 18న సంస్థ నుంచి కాల్ వచ్చిందని ఆమె తెలిపారు. ఈ ఘటనపై నావికుడి కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దీనిపై దర్యాప్తు జరిపించాలని కోర్టును ఆశ్రయించారు.