»Pocharam Srinivas Reddy Pocharams Interesting Comments On Public Governance
Pocharam Srinivas Reddy: ప్రజా పాలనపై పోచారం ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రజా పాలనపై మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికల వరకు కాలయాపన చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తుందని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.
Pocharam Srinivas Reddy: మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి ప్రజా పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికల వరకు కాలయాపన చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తుందని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారని.. కానీ ఇంతవరకు దాని ప్రస్తావనే లేదన్నారు. పంట పెట్టుబడి కింద రూ.15 వేలు అందిస్తామన్నారని కానీ రూ.10 వేలకు కూడా దిక్కులేదని ఎద్దేవా చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదన్నారు. కానీ ప్రియాంక గాంధీ సభలో నిరుద్యోగ భృతి గురించి చెప్పిన ఆధారాలు ఉన్నాయని పోచారం తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అప్పులు చేసిందని, డబ్బులు అయిపోయాయని చెబుతున్నారని అంటున్నారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆదాయం పెంచాలని, దాన్ని ప్రజలకు పంచాలని సూచించారు. గత ప్రభుత్వంలో కళ్యాణలక్ష్మీ, ఆసరా పింఛన్లు, పాఠశాలలు, రైతుబంధు, రైతుబీమా, తదితన పథకాలను ఎక్కడా ఆపలేదని తెలిపారు. గత ప్రభుత్వంపై తప్పులన్ని వేయడం సరికాదని తెలిపారు.