రౌడీ హీరో విజయ్ దేవరకొండ-సమంత కలిసి ఖుషి మూవీలో నటిస్తున్నారు. షూటింగ్ టర్కీలో జరుగుతుండగా.. షూట్ గ్యాప్‌లో ఇద్దరు లంచ్, డిన్నర్ కోసం బయటకు వెళుతున్నారు.
Samantha-Vijay Devarakonda: సమంత (Samantha)- విజయ్ దేవరకొండ (Vijay) కలిసి ఖుషీ అనే మూవీ చేస్తున్నారు. సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతోంది. షూటింగ్ గ్యాప్‌లో సామ్- రౌడీ హీరో (Vijay)తిరుగుతున్నారట. అంటే.. లంచ్, డిన్నర్ కోసం బయటకు వెళ్తున్నారట. వీరిద్దరూ కలిసి బయటకు వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ ఫోటోలో ఇద్దరు చక్కగా ఉన్నారు. ముందు ఆహారం, డ్రింక్ ఉంది. ఆ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. చైతన్యతో విడాకులు తీసుకున్నాక సమంత (Samantha) వరసగా సినిమాలు చేస్తోంది. ఇటు రౌడీ హీరోకు (Vijay) అర్జెంట్‌గా ఓ హిట్ కావాల్సి ఉంది. అందుకే ఖుషీ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. మూవీని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఖుషీ మూవీలోని ఓ పాటను విడుదల చేయగా.. జనం నుంచి మంచి స్పందన వచ్చింది. ఖుషీ మూవీ సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ కానుంది.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు రౌడీ హీరో (Vijay). గీతాగోవిందం బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్‌తో ఓ ఫ్యామిలీ డ్రామా మూవీ చేయనున్నాడు. సోషల్ మీడియాలో రౌడీ బాయ్స్ పేరుతో విజయ్‌కు (Vijay) ఫ్యాన్ గ్యాంగ్ ఉంది. లైగర్ మూవీ ఫ్లాప్ అయినా సరే.. దేశవ్యాప్తంగా అభిమానులు మాత్రం ఏర్పడ్డారు. శాకుంతలం మూవీ డిజాస్టర్ సమంతకు (Samantha) మైనస్ అవుతుంది. ఆమెకు కూడా ఖుషీ మూవీ హిట్ కావడం చాలా అవసరం. సిటాడెల్ హిందీ వెర్షన్లో సమంత (Samantha) నటిస్తోన్న సంగతి తెలిసిందే.