మళయాళి క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌కు యూత్‌లో యమా క్రేజ్ ఉంది. తక్కువ కాలంలో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ జనరేషన్ యూత్‌లో అనుపమా డీపి లేని మొబైల్ ఫోన్ ఉండదేమో. కుర్రాళ్ల కలల రాకుమారి అనుపమా. అలాంటి ఈ బ్యూటీ సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుందనే న్యూస్ వైరల్‌గా మారింది. అసలు మ్యాటర్ వేరే అని తెలియడంతో.. ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
Anupama Parameswaran: అసలు అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) అందానికి, పర్ఫార్మెన్స్కు ఈపాటికి స్టార్ హీరోయిన్ లిస్ట్‌లో టాప్ ఉండాల్సింది. అను మాత్రం మీడియం రేంజ్ హీరోలు, సినిమాల దగ్గరే ఆగిపోయింది. ఇందుకు గ్లామర్ షోకు దూరంగా ఉండడమే. అందుకే అనుపమకు (Anupama) తెలుగు కుర్రాళ్లు తమ గుండెల్లో గుడి కట్టేశారు. ఆమెకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమ్మడు ఎలాంటి పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. అప్పుడప్పుడు అనుపమా చేసే పనులకు అభిమానులు షాక్ అవుతున్నారు.
గతంలో రౌడీ బాయ్స్ సినిమాలో లిప్ లాక్ చేయడంతో కుర్రాళ్లు హర్ట్ అయ్యారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నానని చెప్పడంతో.. ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ.. అను చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఒక ప్లాస్టిక్ కవర్‌ను ఉంగరంలా వేలికి తొడిగిన ఫోటోని షేర్ చేసింది. అంతేకాదు.. తన ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నిజంగానే అనుపమ పరమేశ్వరన్ (Anupama) ఎంగేజ్మెంట్ చేసుకుందా? అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్‌గా మారింది. తీరా అసలు విషయం తెలిశాక అమ్మడిపై.. ఫన్నీగా రకారకాల కామెంట్స్ చేస్తున్నారు.
అనుపమ (Anupama) సరదాగా ఈ పోస్ట్ చేసినట్టు తెలియడంతో ఆమె అభిమానులు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలాంటి షాకులు ఇచ్చి ఫ్యాన్స్‌ను హర్ట్ చెయ్యొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. అబ్బాయి ఎవరు? పెళ్లెప్పుడు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో.. సిద్ధు జొన్నలగడ్డ సరసన డీజె టిల్లు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్‌లో నటిస్తోంది. ఏదేమైనా హీరోయిన్లు అప్పుడప్పుడు ఇలా సరదాగా ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తునే ఉంటారు.