Copy Tune: గుంటూరు కారం.. తమన్ కాపీ ట్యూన్ పై ఫ్యాన్స్ గరం!
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న.. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు 'గుంటూరు కారం' టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తూ.. సాలిడ్ మాస్ స్ట్రైక్ వీడియోని రిలీజ్ చేశారు. సన్నకర్ర సవ్వా దెబ్బ.. బీడి త్రీడిలో కనిపిస్తుందా.. అంటూ మహేష్ బాబు చేసిన రచ్చ మామూలుగా లేదు. కానీ తమనే మళ్లీ కాపీ కొట్టి దొరికిపోయాడంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.
Copy Tune: ‘అ’ సెంటిమెంట్ లేదు, క్లాస్ టైటిల్ కాదు.. ఫస్ట్ టైం ‘గుంటూరు కారం’ (Guntur Karam) అంటూ ఊరమాస్ టైటిల్ ఫిక్స్ చేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Srinivas). ఇక మాస్ స్ట్రైక్ ఓ రేంజ్లో ఉండడంతో.. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాను (social media) హోరెత్తిస్తున్నారు. 24 గంటలు గడవక ముందే 20 మిలియన్స్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది గుంటూరు కారం (Guntur Karam) మాస్ స్ట్రైక్. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. తమన్ ట్యూన్ గురించే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
గుంటూరు కారం (Guntur Karam) ఆల్బమ్ సూపర్ మాస్‌గా ఉంటుందని అంటున్నాడు తమన్. దానికి శాంపిలే మాస్ స్ట్రైక్ ట్యూన్ అని చెబుతున్నాడు. తమన్ (thaman) నుంచి ఎలాంటి ట్యూన్ బయటికొచ్చిన.. కాపీ బ్యాచ్ ఒకటి సోషల్ మీడియాలో కాచుకొని ఉంటోంది. ఇప్పుడు మాస్ స్ట్రైక్ ట్యూన్ కాపీ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్యూన్ విజయ్ సేతుపతి ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమాలో.. అనిరుధ్ ఇచ్చిన ‘డిప్ప డిప్పమ్’ ట్యూన్లా ఉందని అంటున్నారు. ఇక మాస్ స్ట్రైక్ స్టార్టింగ్‌లో వచ్చే మాస్ బీట్.. దేవిశ్రీ ప్రసాద్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ‘లవ్ దెబ్బ’ సాంగ్ బీట్‌లా ఉందంటూ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలని పక్కపక్కన పెట్టి.. తమన్ మళ్లీ కాపీ కొట్టేశాడు అంటూ ట్రోల్ తెగ చేస్తున్నారు.
ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ (mahesh fans) తమన్ పై గరం అవుతున్నారు. తమన్ పై కాపీ క్యాట్ ట్రోల్స్ రావడం కొత్త కాదు. గుంటూరు కారం ట్యూన్ మాత్రం.. నిజంగానే అచ్చు కాపీ ట్యూన్లా ఉందని అంటున్నారు నెటిజన్స్. మీరు కూడా ఓసారి చూసి.. తమన్ కాపీ కొట్టాడో లేదో చెప్పండి.