సమంతా(Samantha) రూత్ ప్రభు ప్రస్తుతం టర్కీలోని ఇస్తాంబుల్లో ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తన రాబోయే చిత్రం “కుషి” పాటల షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సామ్ పలు విషయాలను పంచుకుంది.
టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha) కెరీర్ లో దూసుకుపోతోంది. ది ఫ్యామిలీ మేన్ సిరీస్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సిరీస్ తో సమంత హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు రాబోతున్న మరో సిరీస్ ”సిటాడెల్”తో మరింత అలరించేందుకు కృషి చెందుతుంది. స్యామ్ హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే ఈ కథకు చెన్నై స్టోరీ అనే పేరు ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఖుషీ మూవీ కోసం సమంత టర్కీ(Turkey)లోని ఇస్తాంబుల్ లో ఉంది. ఈ సినిమాకి శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా మూవీ పాటల చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆమె గురించి తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. సమంత చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ ప్రాజెక్ట్ కి ఒకే అయిన విషయం తెలిసిందే. అది కాకుండా ఆమెకు మరిన్ని హాలీవుడ్ ప్రాజెక్టులు వస్తున్నాయట.
కొత్త ప్రాజెక్టుల కోసం హాలీవుడ్ డైరెక్టర్లు సమంతను కాంటాక్ట్ అవుతున్నట్లు మాచారం. టర్కీ నుండే వీడియో కాల్స్ ద్వారా సమంత కొన్ని ఆడిషన్స్ ఇవ్వడానికి సిద్ధమవుతోందని వినికిడి. హాలీవుడ్లో, సాధారణంగా పెద్ద దర్శకులు, నిర్మాణ సంస్థలు స్టార్ నటులను కూడా నిర్దిష్ట పాత్ర కోసం ఆడిషన్ టేపులను పంపమని అడుగుతారు. అది తప్పనిసరి. ఇప్పుడు సమంత కూడా అదే పనిలో ఉందట. ఆడిషన్స్ ఇస్తూ టర్కీలో బిజీగా ఉందట. కాగా, ఒకప్పుడు సమంత తనకు 30ఏళ్లు రాగానే సినిమాలకు స్వస్తి చెబుతానంటూ చెప్పేది. కానీ ఇప్పుడు 36 ఏళ్లు దాటినా ఆమె ఆ మాట చెప్పకుండా, వరసగా అవకాశాలు చేజిక్కించుకుంటోంది. ముఖ్యంగా హాలీవుడ్ లోనూ పాగా వేయడానికి ప్రయత్నిస్తుండటం విశేషం.