రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలు సరైన సమయంలో నిర్వహించడంలో విఫలమైన కారణంగా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW).. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) సభ్యత్వాన్ని నిరవధికంగా రద్దు చేసింది.
ఏపీలోని విజయవాడ(Vijayawada) బెంజిసర్కిల్‌లో భారీ అగ్నిప్రమాదం(fire accident) జరిగింది. ఈ నేపథ్యంలో ఓ షోరూంలో ఉన్న దాదాపు 300కు పైగా బైక్స్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ఆరంభించారు.
బత్తిని సోదరుల్లో ఒకరైన హరినాథ్ గౌడ్(84)(Bathini Harinath Goud) ఇక లేరు. అతను చాలా కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. బత్తిని ఫ్యామిలీ చేప ప్రసాదం పంపిణీ చేయడంలో ప్రసిద్ధి చెందింది.
ఆగస్టు 23న చంద్రయాన్ 3(Chandrayaan 3) చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ చారిత్రాత్మక విజయం నేపథ్యంలో ప్రభాస్ యాక్ట్ చేసిన ఆదిపురుష్(Adipurush) మూవీని తెగ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ మూవీని ఎందుకు ట్రోల్ చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
చంద్రుని(moon)పైకి అనేక దేశాలు ఉపగ్రహాలు పంపుతున్న నేపథ్యంలో అసలు చందమామపై ఏ దేశానికి ఎక్కువ హక్కులు ఉన్నాయి. అక్కడి వనరులు ఎవరికి సొంతం? దీనిపై ఏదైనా ఆంక్షలు ఉన్నాయా లేదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చంద్రయాన్-3 విజయవంతం అవ్వడంతో భారత్ సంబరాలు చేసుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ను ప్రశంసిస్తున్నారు. 14 రోజుల పాటు జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ అనేక పరిశోధనలు చేయనుంది. ఆ సమాచారాన్ని ఇస్రోకు చేరవేయనుంది.
భారత్ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయ్యింది. చంద్రునిపై ల్యాండర్ సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రపంచంలోనే చంద్రుని దక్షిణ ధృవంపై జెండా పాతిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
ప్రపంచ టెన్నిస్ దిగ్గజం అయిన సెరెనా విలియమ్స్ మరోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా అందరూ అభినందనలు తెలుపుతున్నారు.
మిజోరంలో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. దీంతో 17 మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈనెలాఖరు వరకూ ఆ రైళ్లు రద్దయ్యాయి. విజయవాడకు వెళ్లే సెక్షన్ పరిధిలో వివిధ పనులు నిమిత్తం రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ వెల్లడించింది.
గర్భంలోని శిశువులకు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రాకుండా ఫైజర్ కంపెనీ ఓ టీకాను కొనుగొంది. అమెరికా ఆ టీకాకు ఆమోదం తెలిపింది.
తెలంగాణలో అన్ని పార్టీల కంటే ముందుగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండు నియోజకవర్గాల నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణలోని ఓటర్ల సంఖ్యను ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో 3.06 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది.
చంద్రయాన్-3కి సంబంధించి రేపు కీలక ఘట్టం జరగనుంది. విక్రమ్ ల్యాండర్ రేపు జాబిలిపైకి చేరనుంది. ఒకవేళ పరిస్థితులు బాగోలేకపోతే మరో రోజు చంద్రయాన్-3 ల్యాండ్ అవుతుందని ఇస్త్రో శాస్త్రవేత్త తెలిపారు.
తిరుమల శ్రీవారి భక్తుల కోసం రైల్వే శాఖ మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనుంది. పుదుచ్చేరి నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును నడపనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది.