గర్భంలోని పిండాన్ని వైరస్ల నుంచి రక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో అమెరికాకు చెందిన ఓ కంపెనీ విజయం సాధించింది. గర్భంలోని పిండాన్ని కాపాడే టీకాకు అమెరికా ఆమోదం తెలిపింది. ఈ టీకాను ఫైజర్ కంపెనీ (Pfizer Company) రూపొందించింది. రెస్పిరేటరీ సింకిటైల్ వైరస్ (RSV) వ్యాక్సిన్‌కు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతిచ్చింది.
మూడు నెలల నుంచి నాలుగు నెలల మధ్య గర్భంతో (Pregnency) ఉన్నవారికి ఈ టీకాను వేయనున్నారు. ఈ టీకా (vaccine) వల్ల పిండానికి ప్రాణాంతక శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రావు. పిల్లలు పుట్టిన తర్వాత వారికి ఆ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. అమెరికా (America) సంస్థ తయారు చేసిన ఈ టీకాను 32 నుంచి 36 వారాల గర్భంతో ఉన్న గర్భిణులకు ఇవ్వనున్నారు.
గర్భంలోని శిశువులకు తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి ఆరు నెలల వరకూ ఈ టీకా వల్ల రక్షణ కలుగుతుంది. మొదటగా ఈ టీకాకు ఫైజర్ క్లినికల్ పరీక్షలు చేపట్టారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ టీకాను పరీక్షించిన తర్వాత సంతృప్తిని వ్యక్తం చేసింది. టీకా వినియోగానికి అనుమతులు జారీ చేస్తూ ప్రకటన చేసింది. ఆర్ఎస్వీ అనేది శ్వాసకోశ వ్యవస్థకు సోకే ఓ డేంజర్ వైరస్. ఇందులో జలుబు లాంటి లక్షణాలే కనిపించినా ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఏటా 60 ఏళ్లకు పైబడిన వారిలో 1,60,000 మంది చనిపోతున్నారు. ఈ వైరస్ వల్ల ఏటా అమెరికాలో 58 వేల నుంచి 80 వేల వరకూ ఐదేళ్లలోపు చిన్నారులు ఆస్పత్రిపాలవుతున్నారు.