ప్రపంచంలో గూగుల్ ప్లే స్టోర్ (Google Playstore) అతి పెద్ద యాప్స్ పంపిణీ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటని తెలుసు. ఇందులో దాదాపుగా 30 లక్షల యాప్స్, గేమ్స్ ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్ సొంతంగా పాపులారిటీని పెంచుకుంటూ వస్తోంది. తాజాగా ఈ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో హానికర యాప్స్, పాలసీలను ఉల్లంఘించే యాప్స్‌ను తొలగించనున్నట్లు తెలిపింది. తాజాగా 43 హానికర యాప్స్2ను తొలగిస్తున్నట్లు గూగుల్ ప్లే స్టోర్ వెల్లడించింది.
గూగుల్ యూజర్లు (Google Users) కూడా తమ ఫోన్లలో ఆ 43 యాప్స్ ను తొలగించాలని సూచించింది. ఆ యాప్స్ ఫోన్ బ్యాటరీ లైఫ్ ను తినేస్తున్నాయని, అంతేకాకుండా యూజర్ల డేటాను కూడా దొంగిలిస్తున్నట్లు గూగుల్ ప్లే స్టోర్ తెలిపింది. యూజర్ల స్మార్ట్ ఫోన్లు టర్న్ ఆఫ్ అవ్వంగానే ఆ 43 యాప్స్ (43 Apps) ఎక్కువగా యాడ్స్ ను లోడ్ చేస్తున్నట్లు గూగుల్ గుర్తించింది. ఆ చర్య గూగుల్ ప్లే స్టోర్ పాలసీకి విరుద్ధమని ప్లేస్టోర్ తెలిపింది. ఇప్పటి వరకూ ఈ యాప్స్ 25 లక్షల రెట్లు డౌన్లోడ్ అయినట్లు గూగుల్ ప్లే స్టోర్ వెల్లడించింది.
చాలా యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ పాలసీలను (Google Playstore Policy) ఉల్లంఘిస్తున్నాయని ప్రముఖ మొబైల్ రీసెర్చ్ టీం మైకేఫే (Mycafe) తెలిపింది. కొన్ని యాప్స్ ఇప్పటికే ప్లే స్టోర్ నుంచి తొలగించబడ్డాయి. మరికొన్ని యాప్స్‌లను డెవలపర్స్ అప్డేట్ చేసినట్లు గూగుల్ వివరించింది. యూజర్ల తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటే వాటిని వెంటనే డిలీట్ చేయాలని గూగుల్ సూచన చేసింది.
తాజాగా టీవీ, డీఎంబీ ప్లేయర్స్, మ్యూజిక్ డెవలపర్స్, న్యూస్, యాడ్స్ వంటి 43 యాప్స్ (43 Apps)ను గూగుల్ ప్లే స్టోర్ (Google Playstore) తొలగించినట్లు ప్రకటించింది. ట్రస్టెడ్ డెవలపర్స్ నుంచి ఆ యాప్స్‌ను ఇన్స్టాల్ (Instal) చేసుకోవాలని, ఒక వేళ ఇన్స్టాల్ చేసుకునే ముందు పర్మిషన్లు అన్నింటినీ జాగ్రత్తగా ఇవ్వాలని మైకేఫ్ (Mycafe) హెచ్చరించింది.