కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పార్లమెంటు, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభించనున్నాయి.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురవ్వడంతో అధికారులు ఆయన్ని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెలలోపు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించనుంది.
కేరళలో నిపా వైరస్ టెన్షన్ పెడుతోంటే ఒడిశాలో మరో వ్యాధి విజృంభిస్తోంది. ఆ వ్యాధి బారిన పడి ఇప్పటి వరకూ 7 మంది మరణించారు.
హైదరాబాద్ లోని తుక్కుగూడలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ కార్డుల హామీలను ప్రవేశపెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ చేయూతనివ్వనుందని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గ్యారెంటీ ఇచ్చారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు కేసు వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
తెలంగాణలోని విద్యార్థులకు సీఎం కేసీఆర్ దసరా కానుకను ప్రకటించారు. దసరా తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను సర్కార్ ప్రవేశపెట్టనుంది.
ఏపీలో మొత్తం 28 కాలేజీలు ఏర్పాటు కానున్నట్లు సీఎం జగన్ తెలిపారు. నేడు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల జిల్లాల్లో 5 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు.
ఏపీలోని గుంటూరులో ఎస్ఐ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తుండగా పరుగు పోటీల్లో ఓ యువకుడు మృతి చెందాడు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో రోజుకో ట్విస్ట్ నెలకుంటోంది. తాాజా ఈ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో ఏ29గా హీరో నవదీప్‌ను పోలీసులు చూపించారు. అయితే తనకు డ్రగ్స్ కేసుతో ఎటువంటి సంబంధం లేదని నవదీప్ హైకోర్ట్ ను ఆశ్రయించారు. దీంతో నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దంటూ టీఎస్ హైకోర్ట్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో హీరో నవదీప్ ఉన్నారని, బేబీ సినిమాలోని దృశ్యాలే స్పాట్ లో కనిపించాయని తెలిపారు. బేబీ మేకర్స్‌కు నోటీసులు ఇవ్వనున్నామన్నారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ1గా చంద్రబాబు పేరును చేర్చుతూ ఏపీ సీఐడీ పిటీషన్ వేసింది. ఈ కేసుపై రేపు న్యాయస్థానంలో విచారణ జరగనుంది.
సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువతులు దుర్మరణం చెందారు. పరీక్షలు రాసి వస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది.