తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇంకా ఆరోగ్యం కుదుటపడలేదు. పది రోజులైనా వైరల్ ఫీవర్ ఇంకా తగ్గకపోవడంతో ఆయన ప్రగతి భవన్ లోనే చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లను సీఎం కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. వేర్వేరు నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది.
తెలంగాణలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సర్వే సంస్థలు దూకుడు పెంచాయి. చాలా సర్వేల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ పోల్ సర్వేలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ముందంజలో ఉంది.
పన్ను ఎగవేత కేసులో హైదరాబాద్‌లోని మమతా బెనర్జీ క్యాబినెట్ మంత్రులు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్ల ఇళ్లు, నివాసాలు.. తమిళనాడులోని ఒక డిఎంకె ఎంపి, అతని సమీప బంధువులపై దాడులు జరిగాయి. ఇదిలా ఉండగా, 'భయపెట్టడానికే' ఏజెన్సీల దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఎల్లో సీలో ఇరుక్కుపోయిన సబ్ మెరైన్ వల్ల 55 మంది చైనా నావికులు చనిపోయారు.
తీస్తా నదిలో వరద బీభత్సం సృష్టించింది. నీటి వేగం చాలా ఎక్కువగా ఉంది. అది మంగన్ జిల్లాలోని టూంగ్ వంతెనను విచ్ఛిన్నం చేసింది. తద్వారా ఇతర జిల్లాలతో చుంగనాథ్ కనెక్టివిటీ తెగిపోయింది. ఫోడాంగ్ నుండి కూడా ఒక వంతెన కొట్టుకుపోయిందని వార్తలు వస్తున్నాయి. ఫోడాంగ్ - డిచ్కు జిల్లాల్లో మాత్రమే ఎక్కువ విధ్వంసం కనిపించింది.
తీవ్ర ఉత్కంఠ నడుమ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. ఈ కేసులో సీఐడీ తరపు లాయర్లు తమకు కొంత గడువు కావాలని కోరడంతో సోమవారానికి కేసును వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. జనసేన నేతల ఫిర్యాదు మేరకు కోర్టు పోసానిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు.
వైసీపీ సర్కార్‌కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. అంగళ్లు కేసులో తాము కలగజేసుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో వైసీపీ సర్కార్ పెట్టిన 6 పిటీషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
తనకు ఇచ్చిన నోటీసులపై నారా లోకేశ్ రెండు లంచ్ మోషన్ పిటీషన్లు వేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు లోకేశ్ పిటీషన్లను విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాటిపై విచారణ జరగనుంది.
రేపటి నుంచి తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరగనుంది. బతుకమ్మ పండగను పురస్కరించుకుని ఈసారి కోటికి పైగా చీరలను సీఎం కేసీఆర్ సర్కార్ సిద్ధం చేసింది.
ఆసియా క్రీడల్లో టీమిండియా సత్తా చాటింది. టీ20లో నేపాల్ జట్టును 23 పరుగుల తేడాతో ఓడించి సెమీస్‌కు చేరింది. భారత ఆటగాడు యశస్వి జైస్వాల్ 49 బంతుల్లోనే 100 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు.
ఈరోజు (October 3rd 2023) రాశి ఫలాల్లో(horoscope today) మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అంశాలు, అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకుందాం.
దేశంలో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అసోం, మేఘాలయాలతో పాటుగా పొరుగు దేశాల్లో కూడా భూకంపం సంభవించింది.
మంత్రి రోజాపై బండారు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరు పోలీసులకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 41ఏ, 41బీ సెక్షన్ల కింద పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.