తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ (Cm KCR) తీవ్ర జ్వరం (Viral fever)తో బాధపడుతున్నారు. నేడు తెలంగాణలో బ్రేక్ఫాస్ట్ (Breakfast) కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించాల్సి ఉంది. అయితే ఆయనకు వైరల్ ఫీవర్ ఇంకా తగ్గకపోవడంతో ప్రగతి భవన్ లోనే చికిత్స పొందుతున్నారు. సీఎం కేసీఆర్కు వైరల్ ఫీవర్ వచ్చి దాదాపు 10 రోజులు అయ్యింది. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం (health) మెరుగుపడలేదు.
మరోవైపు సీఎం కేసీఆర్ ఇంకా కోలుకోలేదని సమాచారం తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నేడు రావివ్యాలలో అల్పాహార పథకాన్ని కేసీఆర్ (Cm KCR) ప్రారంభించాల్సి ఉండగా తన అనారోగ్యం కారణంగా కార్యక్రమానికి హాజరు కాలేదు. గురువారం నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కేసీఆర్తో భేటీ అయ్యారు. టికెట్ విషయం అడగ్గా తన ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని, ఏం మాట్లాడలేకపోతున్నానని సీఎం కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.
ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ (Cm KCR) పలు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. అలాగే పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కూడా పెద్ద ఎత్తున సమావేశాన్ని నిర్వహించాల్సి ఉందని, ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల అవన్నీ వాయిదా పడుతున్నట్లు బీఆర్ఎస్ (BRS) వర్గాల సమాచారం. ప్రస్తుతం కేటీఆర్ (KTR), హరీష్ రావులు మాత్రమే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. నేడు బ్రేక్ ఫాస్ట్ ప్రాజెక్ట్ను కూడా హరీష్ రావే ప్రారంభించారు.