»Shock For Brs In Telangana Congress Leading In Lok Poll Survey
Lok Poll-Telangana: తెలంగాణలో బీఆర్ఎస్కు షాక్.. లోక్ పోల్ సర్వేలో కాంగ్రెస్ ముందంజ
తెలంగాణలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సర్వే సంస్థలు దూకుడు పెంచాయి. చాలా సర్వేల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ పోల్ సర్వేలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ముందంజలో ఉంది.
Campaign Of The Candidate Who Did Not Know The Streets
తెలంగాణలో అధికార పార్టీ అయిన బీఆర్ఎస్కు షాక్ తగిలింది. లోక్ పాల్ చేపట్టిన సర్వేలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ వైపు అధిక శాతం మంది మొగ్గుచూపుతున్నట్లు తేలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 2 నెలల సమయం ఉంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు చేపట్టేందుకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఆ షెడ్యూల్ ప్రకారంగా డిసెంబర్ 7వ తేదిన తెలంగాణలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇది తాత్కాలిక షెడ్యూల్ మాత్రమే అయినప్పటికీ కొంచెం అటు ఇటుగా ఎన్నికలు మాత్రం నిర్వహించనున్నారు.
ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఈ సారి బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 వరాలను ప్రకటించింది. ప్రస్తుతం అభ్యర్థులను ప్రకటించే పనిలో పడింది. బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికలో ఉంది. ఓ వైపు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంటే మరో వైపు రాష్ట్రంలో ఎలక్షన్స్ సర్వేలో జోరందుకున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా లోక్ పాల్ సర్వే చేయగా అందులో అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ 45-51, కాంగ్రెస్ 61-67, ఎఐఎంఐఎం 6-8, బిజెపి 2-3, ఇతరులకు 0-1 సీట్లు రావొచ్చని ఆ సర్వే వెల్లడించింది. అలాగే ఓటింగ్ శాతం కూడా చూస్తే..బిఆర్ఎస్ 39-42%, కాంగ్రెస్ 41-44% , AIMIM 3-4%, బిజెపి 10-12%, ఇతరులు 3-5% రావొచ్చని సర్వే అంచనా వేసింది. ఈ సర్వే చెప్పినట్లుగా జరిగితే అధికార పార్టీ అయిన బీఆర్ఎస్కు గట్టి షాకే తగిలేలా ఉంది.
తెలంగాణలో రెండు సార్లు బీఆర్ఎస్ను గెలిపించిన ప్రజలు ఈసారి కాంగ్రెస్కు పట్టం కట్టాలని చూస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియాకు కృతజ్ఞతగా ఒక్క ఛాన్స్ వారికి ఇవ్వాలనే ధోరణిలో తెలంగాణ ప్రజలు చూస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈసారి బీఆర్ఎస్ కీలక నేతలంతా ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతుండటం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై అభిమానం, నమ్మకం పెరిగేలా చేస్తున్నాయి.