»What Is The Main Reason For The Disgruntled Leaders In The Telangana Bjp Committee
BJP Committee: బీజేపీ కమిటీలో అసంతృప్తి నేతలకు ప్రాధాన్యం కారణం ఏంటి.?
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తన జెండా పాతాలని బలమైన ప్రయత్నాలు చేస్తుంది. నిజమాబాద్ సభలో కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ ప్రధాని నరేంద్రమోడి చేసిన వ్యాఖ్యలను బట్టే అర్థం చేసుకోవచ్చు. కేంద్రం ఈ సారీ తెలంగాణను ఎంత సిరీయస్‌గా తీసుకుందో అని. అందుకోసం ఏ ఛాన్స్‌ను కూడా వదులుకోవాలని అనుకోవడం లేదు.
What is the main reason for the disgruntled leaders in the Telangana BJP Committee?
BJP Committee: తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) బీఆర్ఎస్ పార్టీతో దేశరాజకీయాలు చేస్తుండగా, బీజేపీ(BJP) ఈ సారి ఎలాగైనా రాష్ట్రంలో తమ సత్తా చాటాలని చూస్తోంది. తెలంగాణను ఆరు జోన్లుగా విభజించుకుని ఎన్నికల వ్యూహాలు అమలు చేయాలని కమలం భావిస్తోంది అందులో భాగంగా నియోజకవర్గాల్లో కార్యకర్తలను కదిలించడానికి, ప్రచారం ముమ్మరం చేయడానికి పూనుకుంది. తాజాగా ఎన్నికల కోసం కమిటీల్ని ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి(Komatireddy Rajagopalreddy)కి కీలక బాధ్యతలు అప్పజెప్పింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ ప్రకటన విడుదలచేసింది. అలాగే పబ్లిక్ మీటింగ్ కమిటీ ఇంఛార్జ్‌గా బండి సంజయ్(Bandi Sanjay), మ్యానిఫెస్టో, పబ్లిసిటీ కమిటీలకు చైర్మన్ గా గడ్డం వివేక్ వెంకటస్వామి, ఛార్జ్‌షీట్ కమిటీ చైర్మన్‌గా మురళీధర్‌రావు ఎంపిక చేసింది.
నిరసనలు, ఆందోళను నిర్వహించే అజిటేషన్ కమిటీకి విజయశాంతి(VijayaShanthi)ని చైర్మన్‌గా, ప్రభావిత వ్యక్తులను కలిసే కమిటీ చైర్మన్ గా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎన్నికల కమిటీ చైర్మన్‌గా మర్రి శశిధర్ రెడ్డి, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా ధర్మపురి అర్వింద్‌లకు బాధ్యతలు అప్పజెప్పింది. పొంగులేటి సుధాకర్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్సీలు రామచందర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలకు సైతం కమిటీలలో చోటు కల్పించారు. సునీల్ బన్సల్ అధ్యక్షతన జరిగే పార్టీ సంస్థాగత సమావేశంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జిలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొంటారు.
కమిటీలో రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి తదితరులకు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక కారణాలు చర్చనీయంశం అవుతున్నాయి. బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించలేక, అనుమతించలేక సతమతమౌతున్న వీరిని తెలంగాణ ప్రతిపక్షపార్టీ కాంగ్రెస్ గాలం వేస్తుందన్న వార్తలు చెక్కర్లు కొట్టాయి. అందులో భాగంగానే సంస్థగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బీజేపీ అసమ్మతిదారులతో టచ్‌లో ఉన్నట్లు, వారిని హస్తం పార్టీకి ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది. రాష్ట్రంలో బలపడుతున్న పార్టీగా ఎదుగుతున్న కాంగ్రెస్‌లో పార్టీ వీడి బీజేపీలోకి వెళ్లిన వారిని టార్గెట్‌గా చేస్తున్నారు నేతలు. ఇదిలా ఉంటే నిజమాబాద్ ప్రధాని మోడీ బహిరంగ సభకు పై నేతలు హాజరు కాలేదు. దాంతో వారు పార్టీపట్ల అసమ్మతితో ఉన్నారని, ఏ క్షణం అయినా పార్టీ మారే అవకాశం ఉందని అందరూ భావించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే బీజేపీ ఏర్పాటు చేసిన కమిటీలో వివిధ విభాగాలకు వీరిని చైర్మెన్‌గా నియమించినట్లు తెలుస్తుంది.