• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

ఆత్మహత్యల్లేవు.. గవర్నర్ కు సీఎం కేసీఆర్ కౌంటర్

తెలంగాణలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.. పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణలో ఆత్మహత్యలు లేవని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవని బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, మాజీ ఎంపీ జయరామ్ పంఘి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగా...

January 27, 2023 / 09:04 PM IST

IND vs NZ : ముగిసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్.. భారత్ కు 177 పరుగుల లక్ష్యం

IND vs NZ : భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పూర్తయింది. పరిమిత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 176 పరుగులు చేసి భారత్ కు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో మిచెల్, కాన్వే రాణించారు. మిచెల్ నాట్ అవుట్ గా నిలిచి 30 బంతుల్లో 59 పరుగులు చేశాడు. కాన్వే 35 బంతుల్లో 52 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఫిన్ […]

January 27, 2023 / 08:58 PM IST

సికింద్రాబాద్ మారేడుపల్లిలో అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్ లోని మారేడుపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. మారేడుపల్లిలో ఉన్న శ్రీలా హిల్స్ అనే అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు చుట్టుపక్కన ఉండే ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. వెంటనే రంగంలోకి దిగిన ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా? ప్రమాదం ఎలా జరిగింది.. అనే విషయాలు తెలియాల్సి ఉంది.

January 27, 2023 / 08:24 PM IST

పాదయాత్ర ముగియగానే నేరుగా తారకరత్న దగ్గరికి వెళ్లిన నారా లోకేశ్

యువగళం పేరుతో టీడీపీ యువనేత నారా లోకేశ్ ఈరోజు నుంచి ఏపీలో పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇవాళ ప్రారంభమైన పాదయాత్రలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర ప్రారంభం అయిన తర్వాత లోకేశ్ తో పాటు పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ...

January 27, 2023 / 08:16 PM IST

మూడు పెళ్లిళ్లపై బాలయ్య ప్రశ్న.. ఇరకాటంలో పవన్ కల్యాణ్

టాక్ షోలలోనే నంబర్ వన్ గా నిలుస్తున్న అన్ స్టాపబుల్-2 షోకు సంబంధించిన మరో ప్రొమో విడుదలైంది. షో హోస్ట్ నందమూరి బాలకృష్ణ తన ప్రశ్నలతో సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను ఇరకాటంలోకి నెట్టేశాడు. ముఖ్యంగా మూడు పెళ్లిళ్లు, సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న సవాళ్లపై బాలయ్య ప్రశ్నలు అడగడంతో పవన్ కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాడు. అయినా కూడా పవన్ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. ఈ మధ్యలో రామ్ చరణ్, సాయిధ...

January 27, 2023 / 07:37 PM IST

మోదీ డాక్యుమెంటరీపై యూనివర్సిటీలలో రచ్చ.. 144 సెక్షన్.. విద్యార్థుల అరెస్ట్

కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని మోదీ మీద బీబీసీ చానెల్ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా యూనివర్సిటీ అధికారులు అడ్డుకుంటున్నారని విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో తాజాగా టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఎన్ఎస్ యూఐకి చెందిన విద్యార్థులు యూనివర్సిటీలో డాక్యుమెంటరీని ప్రదర్శ...

January 27, 2023 / 07:24 PM IST

IND vs NZ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

IND vs NZ : భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 సమరం ప్రారంభమయింది. టీ20 సిరీస్ లో భాగంగా ఇవాళ మొదటి మ్యాచ్ ఇంకాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా నుంచి శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, త్రిపాఠి, సూర్య కుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా(కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా, కుల్ దీప్ యాదవ్, శివమ్ [&...

January 27, 2023 / 06:56 PM IST

సీఎం జగన్ వస్తున్నాడు.. పెళ్లి వేరే చోట చేస్కోండి

నెలన్నర ముందు వివాహ మండపం బుక్ చేసుకుంటే తీరా పెళ్లి సమయం వచ్చేసరికి మండపం నిర్వాహకులు షాకిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉండడంతో తాము మండపం ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దీంతో హడావుడిగా వెంటనే వేరే మండపం కోసం కాబోయే దంపతులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. సీఎం జగన్ పర్యటన తమ చావుకొచ్చిందని ఆ కుటుంబసభ్యులు వాపోయారు. ఈ సంఘటన ఏపీలోని విశాఖపట్టణంలో జరిగింది. దీనికి సంబంధించిన ...

January 27, 2023 / 05:48 PM IST

భద్రతా వైఫల్యం.. రాహుల్ జోడో యాత్రకు బ్రేక్

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లో యాత్ర కొనసాగుతోంది. అయితే శుక్రవారం అకస్మాత్తుగా పాదయాత్రకు బ్రేక్ పడింది. భద్రతా వైఫల్యంతో రాహుల్ తన యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ లో స్థానిక యంత్రాంగం భద్రత కల్పించడంలో విఫలమవుతోంది. ప్రజలను నియంత్రించడంలో విఫలమవుతున్నారని గుర్తి...

January 27, 2023 / 04:29 PM IST

నీలి రంగులోకి తారకరత్న..బెంగళూరు తరలిస్తాం: బాలకృష్ణ

‘యువగళం’ పేరిట కుప్పం నుంచి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనాల తాకిడికి నటుడు నందమూరి తారకరత్న సొమ్మసిల్లిపడిపోయాడు. అతడి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి అతడి శరీరం నీలిరంగులోకి మారిందని చెప్పారు. మెరుగైన చికిత్స కోసం తారకరత్నను తెలుగుదేశం పార్టీ నాయకులు బెంగళూరుకు తరలిస్తున్నట్లు సమాచారం. ల...

January 27, 2023 / 04:12 PM IST

కాళ్లు మొక్కుతానన్న వదల్లేదు.. అడవిలో అత్యాచారం

తండ్రి లేడు.. తల్లి కూలీ పనులు చేస్తూ కష్టపడి చదివిస్తోంది. బుద్ధిగా చదువుకుంటున్న అమ్మాయిని తోటి విద్యార్థులు కన్నేశారు. ఆమెను ఆట పట్టించడం మొదలుపెట్టారు. ఆమెకు ప్రలోభాలు చూపించి లొంగ దీసుకున్నారు. పెళ్లి చేసుకుంటామని మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. కాళ్లు మొక్కుతా వదిలేయండి అని బతిమిలాడినా వినలేదు. అడవికి తీసుకెళ్లి ఒక్కరు కాదు ఏకంగా ముగ్గురు అత్యాచారం చేశారు. పాశవికంగా ప్రవర్తించడ...

January 27, 2023 / 03:23 PM IST

మోదీకి కేరళ షాక్.. బీచ్ లో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన

గుజరాత్ అల్లర్లపై ప్రఖ్యాత వార్తా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ( India: The Modi Question) దేశంలో వివాదాలకు కేంద్రంగా మారింది. భారత్ లో నిషేధించిన డాక్యుమెంటరీని గణతంత్ర దినోత్సవం రోజు పలుచోట్ల వీక్షించారు. ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించిన ఆయా చోట్ల ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. తెలంగాణలోని హెచ్ సీయూలో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన చేయడంతో వర్సిటీలో అలజడి మొదలైంది. రెండు విద్యార్థి సంఘాల మధ...

January 26, 2023 / 09:39 PM IST

Breaking: బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విస్తృతంగా పర్యటించారు. హిందుపురం, లేపాక్షి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. జెండా వందనాలు చేసిన అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్న బాలకృష్ణకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రచార వాహనంపై నుంచి బాలయ్య పడబోయాడు. వెంటనే టీడీపీ నాయకులు పట్టుకోవ...

January 26, 2023 / 09:12 PM IST

రిపబ్లిక్ డే స్పెషల్.. జిగేల్ మంటున్న పార్లమెంట్.. వీడియో

74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ భవనం జిగేల్ మంటోంది. సాయంత్రం కాగానే పార్లమెంట్ లోని నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ మొత్తాన్ని లైట్లతో ప్రకాశించేలా చేశారు. పార్లమెంట్ భవనం ముందు జాతీయ జెండాను ప్రదర్శించడంతో పాటు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం పుస్తకాన్ని ప్రదర్శించారు. కొన్ని నిమిషాల పాటు పార్లమెంట్ మొత్తం కళ్లు జిగేల్ మనేలా ప్రకాశించింది. పార్లమెంట్ భవనాల చుట్టూ లైట్స్ అమర్చ...

January 26, 2023 / 08:46 PM IST

కార్ల షోరూమ్ లో భారీ అగ్ని ప్రమాదం

గుజరాత్ లోని సూరత్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూరత్ లోని ఉధ్నా ప్రాంతంలో ఉన్న కార్ల షోరూమ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో షోరూమ్ లో ఉన్న కార్లన్నీ మంటల్లో కాలిపోయాయి. షోరూమ్ లో ఉన్న కొత్త కార్లన్నీ మంటలకు ఆహుతి అయిపోయాయి. భారీ అగ్ని ప్రమాదం వల్ల ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున్న లేచాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. అగ్ని ప్రమాదం ...

January 26, 2023 / 08:26 PM IST