కోవిషీల్డ్ టీకా(covishield vaccine) తీసుకున్న వారికి హార్ట్ ఎటాక్(heart attack) వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ప్రముఖ ప్రముఖ బ్రిటిష్-ఇండియన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అసీమ్ మల్హోత్రా(aseem malhotra) తెలిపారు. బ్రిటన్లో ఈ టీకా వేసుకున్న వారిలో దాదాపు 10 శాతం మందికి ఇదే పరిస్థితి తలెత్తినట్లు చెప్పారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండెపోటుతోపాటు పక్షవాతం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు చిన్న, పెద్దవారిలో కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. కరోనా కట్టడి కోసం ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంస్థలు ఈ టీకాను ఉత్పత్తి చేశాయి.
తీవ్రమైన దుష్ప్రభావాల కారణంగా UK సహా కొన్ని యూరోపియన్ దేశాలలో ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ ను నిలిపివేశారని పేర్కొన్నారు. కానీ భారతదేశంలో దీనిని ఎందుకు అనుమతిచ్చారని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు, వాణిజ్య సంస్థలు, పెద్ద ఫార్మా కంపెనీలను అనుమతించడంతో మహమ్మారిని సృష్టించి ప్రజలకు తెలియకుండానే హాని కలిగించడం ప్రధాన సమస్యగా మారవచ్చని మల్హోత్రా అన్నారు. ఇది ప్రధానంగా ఫార్మాస్యూటికల్ పరిశ్రమ తమ వాటాదారులకు లాభం చేకూర్చడానికే ఇలా చేశారని ఆయన ఆరోపించారు.
అయితే ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనెకా COVID-19 వ్యాక్సిన్ 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులందరికీ సురక్షితమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత ఏడాది తెలిపింది. కానీ జూన్ 2022 నుంచి ఈ టీకా ఇన్ఫెక్షన్ కారణంగా ప్రజలు తీసుకోవడం వాయిదా వేయాలని WHO చెప్పినట్లు గుర్తు చేశారు. మరోవైపు హృదయనాళ వ్యవస్థకు సంబంధించిన తీవ్రమైన దుష్ప్రభావాల కారణంగా ఫైజర్, మోడెర్నా తయారు చేసిన ఎమ్ఆర్ఎన్ఏ వ్యాక్సిన్లను నిలిపివేయాలని ఇప్పటికే అంతర్జాతీయంగా నిరసనలు వచ్చినట్లు వెల్లడించారు.