అధికార యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నికలకు సమయం దగ్గరికి వస్తుండడంతో ఈలోపే అధికార యంత్రాంగానికి పూర్తి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఐపీఎస్, ఐఏఎస్ లతో పాటు అన్ని శాఖల్లోనూ పదోన్నతులు, బదిలీలు చేపడుతోంది. ఇప్పటికే ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కొందరు అధికారులకు పదోన్నతులు కల్పించింది. రాష్ట్రంలోని 10 మంది అధికారులకు తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ హోదా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరితోపాటు మరో ఏడుగురు ఐపీఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది.
ఐఏఎస్ హోదా పొందిన వారు
జల్ద అరుణ శ్రీ
నిర్మల కాంతి వెస్లీ
కోటా శ్రీవాస్తవ
చెక్కా ప్రియాంక
బడుగు చంద్రశేఖర్
కోరం అశోక్ రెడ్డి
హరిత
వెంకట నర్సింహారెడ్డి,
కాత్యాయని
నవీన్ నికోలస్
బదిలీ అయిన ఐపీఎస్ లు
సైబరాబాద్ పరిపాలన డీసీపీగా యోగేశ్
సీఐడీ ఎస్సీగా ఆర్.వెంకటేశ్వర్లు
పీసీఎస్ గా రంగారెడ్డి
జీఆర్పీ అడ్మిన్ డీసీపీగా రాఘవేందర్ రెడ్డి
వరంగల్ పోలీస్ శిక్షణా కేంద్రం ఎస్పీగా పూజ
డీజీపీ కార్యాలయం న్యాయ విభాగం ఎస్పీగా సతీశ్
వరంగల్ నేర విభాగం డీసీపీగా మురళీధర్