టర్కీ, సిరియా భూకంప విలయం ధాటికి మరణాల సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఇప్పటివరకు బాధిత మృతుల సంఖ్య 8,300కి చేరిందని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నారు. ఈ క్రమంలో సిరియాలో 2,400 మందికి పైగా మరణించినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఇరు దేశాల్లో ఏటు చూసినా కూలిన భవనాలు, కుప్పలు కుప్పలుగా ఉన్న శవాలతో హృదయవిదారక దశ్యాలే కనిపిస్తున్నాయి. ఈ ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా కూడా శిథిలాలను తొలగిస్తున్న కొద్ది మృతదేహాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
గతంలో పలు దేశాల్లో భూకంపం సంభవించిన ఘటనలు ఇప్పుడు చుద్దాం
జూన్ 22, 2022 – ఆఫ్ఘనిస్తాన్లో 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం- 1,100 మందికి పైగా మృతి
ఆగస్టు 14, 2021 – హైతీలో 7.2 తీవ్రతతో సంభవించిన భూకంపం- 2,200 మందికి పైగా మరణం
సెప్టెంబర్ 28, 2018 – 5.5 తీవ్రతతో భూకంపం ఇండోనేషియాను తాకింది, సునామీ ప్రభావం – 4,300 మందికి పైగా మృతి
ఏప్రిల్ 25, 2015 – నేపాల్లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం – 8,800 మందికి పైగా మృతి