మేషం:
ఈ రాశివారి మాటకు, చేతకు తిరుగుండదు. అన్ని పనులూ సకాలంలో పూర్తవుతాయి. ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు బావుంటాయి. ఆదాయం బావుంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేక గుర్తింపు వస్తుంది. వ్యాపారాలు బావుంటాయి. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృషభం:
రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. అన్ని విధాలుగా లాభాలు చేకూరుతాయి. సంఘంలో గౌరవమర్యాదలు దక్కుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్ వస్తుంది. వ్యాపారాలలో కొత్త ఆలోచనలు చేస్తారు. స్నేహితులకు సాయం చేస్తారు. ఆరోగ్యం బావుంటుంది. ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించండి.
మిథునం:
ఆదాయంలో బావుంటుంది. శుభ కార్యాలు, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో విశ్రాంతి దొరకదు. ఉద్యోగంలో అధికారులకు పనితీరును మెచ్చుకుంటారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.
కర్కాటకం:
వృత్తి, ఉద్యోగాల్లో చికాకులు తప్పవు. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కోలుకుంటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం దక్కుతుంది. స్నేహితులకు సాయం చేస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి.
సింహం:
ఉద్యోగపరంగా, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. వృత్తి, వ్యాపారాల్లో వేగాన్ని పెంచుతారు. ఆదాయ మార్గాలు విస్తరిస్తారు. సతీమణికి వృత్తి, ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు దక్కుతాయి. శుభవార్తలు వింటారు. నాగమ్మ ఆలయాన్ని దర్శించుకోండి.
కన్య:
వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆదాయం బావుంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. నారాయణ మంత్రాన్ని పఠించండి.
తుల:
ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి జరుగుతుంది. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. అనుకున్నది సాధిస్తారు. శివాలయాన్ని సందర్శించండి.
వృశ్చికం:
వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కోపం తెచ్చుకోకుండా ఉండండి. ఆంజనేయ దండకాన్ని పఠించండి.
ధనుస్సు:
ఏ పనిలోనైనా మంచి సాధిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం బావుంటుంది. తోబుట్టువులు, బంధువులు, స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించండి.
మకరం:
ఏ పని అనుకున్నా ప్రయత్నం ఫలిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండండి. పిల్లలు విజయాలు పొందుతారు. ఆరోగ్య సమస్యలు ఉండవు. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. గణేషుడికి పూజ చేయండి.
కుంభం:
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలు బావుంటాయి. దైవకార్యాల్లో పాల్గొంటే మంచిది. కొందరు మిత్రుల్ని ఆర్థికంగా ఆదుకుంటారు. అనారోగ్య సమస్యలు వస్తాయి. సుబ్రమణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి.
మీనం:
వృత్తి, ఉద్యోగాల్లో కాస్త ఇబ్బందులు తప్పవు. సతీమణికి అనారోగ్య సమస్యలు వస్తాయి. వ్యాపారాలు బావుండవు. ఇతరుల నుంచి అప్పులు చేయకండి. మనసును స్థిమితం చేసుకోండి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. బంధువుల నుంచి అశుభ వార్తలు వినాల్సి వస్తుంది. దుర్గమ్మను, నాగదేవతను నమ్ముకోండి.