55 Chinese sailors dead as submarine gets stuck in trap for foreign vessels: Report
submarine : సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. సబ్ మెరైన్ ప్రమాదానికి గురి కావడంతో 55 మంది చైనా నావికులు ప్రాణాలు కోల్పోయారు. సబ్ మెరైన్ ఎల్లో సీలో ఇరుక్కుపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. న్యూక్లియర్ సబ్మెరైన్ లో 55 మంది చైనా నావికులు ప్రయాణిస్తున్నారు. చైనా శత్రు దేశాల కోసం గతంలో ఏర్పాటు చేసిన ట్రాప్ లో సబ్ మెరైన్ ఇరుక్కుంది.
ఏటు కదల్లేకుండా గంటల తరబడి అక్కడే నిలిచి పోయింది. నావికుల కోసం ఏర్పాటు చేసిన ఆక్సిజన్ వ్యవస్థ పని చేయలేదు. ఎమర్జెన్సీ టైంలో పని చేయాల్సిన సిస్టమ్ కూడా ఆఫ్ అయింది. దీంతో ఊపిరాడక, ఉక్కిరిబిక్కిరి అయి 55 మంద నావికులు అందులోనే జల సమాధి అయ్యారు. మరణించిన వారిలో కెప్టెన్ కల్నల్ జు యోంగ్-పెంగ్ తో పాటు.. 27 మంది ఆఫీసర్లు, ఏడుగురు ఆఫీస్ క్యాడెట్లు, 17 మంది నావికులు, 9 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. సబ్ మెరైన్ లో సిస్టమ్ వైఫల్యం కారణంగానే వారంతా చనిపోయినట్లు తెలుస్తోంది.