ప్రకాశం: కొండపి సర్కిల్ పరిధిలోని అసాంఘిక కార్యకలాలపై ఉక్కుపాదం మోపాలని కొండపి సీఐ జి.సోమశేఖర్ సిబ్బందికి సూచించారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో సర్కిల్ పరిధిలోని సిబ్బందికి డ్రిల్, గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సోమశేఖర్ సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వ్యాయామం చేస్తూ.. ఫిట్నెస్ కలిగి ఉండాలని సూచించారు.