నారా లోకేశ్‌కు సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయన్ని ఏ14గా చేర్చుతూ సీఐడీ అధికారులు స్వయంగా నోటీసులివ్వడం చర్చనీయాంశమైంది. అక్టోబర్ 4వ తేదిన ఆయన విచారణకు హాజరుకావాలని సీఐడీ కోరింది.
ఆర్బీఐ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి గడువును అక్టోబర్ 7వరకు పొడగించింది. 2000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి ఆర్బీఐ మరో అవకాశం కల్పించింది.
ODI ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ప్రపంచ కప్‌కు ముందు వన్డేల్లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసి రికార్డు సృష్టించిన ఆటగాడి గురించి తెలుసుకుందాం.
సింగరేణి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. అక్టోబర్ 28వ తేదిన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.
చంద్రబాబు ముందస్తు బెయిల్‌ను సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ కేసు విచారణను అక్టోబర్ 3వ తేదికి వాయిదా వేసింది.
సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యుల సమక్షంలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.2,222 కోట్ల లాభాల్లో 32 శాతం వాటాగా ఉద్యోగులు, కార్మికులకు రూ.711 కోట్లను ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు అలముకోవడంతో ప్రయాణికులు రైలు నుంచి పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేసినప్పటికీ మరోసారి పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు.
తెలంగాణ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు. దీంతో ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులగా ఉన్న దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకు షాక్ తగిలినట్లైయ్యింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు సిక్సులు, ఫోర్లతో చెలరేగిపోయారు. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేశారు. దీంతో ఆసీస్ ముందు భారీ టార్గెట్ నిలిచింది.
చంద్రబాబుకు మరో 11 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో అక్టోబర్ 5వ తేది వరకూ ఆయన రాజమండ్రి జైలులోనే ఉండనున్నారు. సోమవారం బెయిల్‌పై విచారణ ఉంటుందని జడ్జి తెలిపింది.
తెలంగాణలో ఇటివల నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పరీక్షను మళ్లీ నిర్వహించాలని తెలిపింది. జూన్ 11న రెండో సారి నిర్వహించిన ఈ పరీక్షకు 2.32 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. అయితే పరీక్ష నిర్వహణ తీరు సరిగా లేదని, బయోమెట్రిక్ వివరాలు కూడా తీసుకోలేదని పలువురు హైకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాదు హాల్ టిక్కెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీ...
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యింది. దీంతో మహిళలకు అసెంబ్లీ, పార్లమెంటులో 33 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. అయితే 2029 ఎన్నికల్లో ఈ బిల్లు అమలు కానుంది.
ఏపీ సీఎం జగన్ అస్వస్థతకు గురవ్వడంతో ఆయన సమావేశాలన్నింటినీ రద్దు చేశారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్న అధికారులు తెలిపారు.
చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబు ప్రభుత్వం హస్తం ఉందని సీఐడీ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ జారీ చేసింది.