IND vs AUS : దంచికొట్టిన భారత్..ఆస్ట్రేలియా టార్గెట్ 400
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు సిక్సులు, ఫోర్లతో చెలరేగిపోయారు. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేశారు. దీంతో ఆసీస్ ముందు భారీ టార్గెట్ నిలిచింది.
ఇండోర్ స్టేడియంలో భారత్ ఆటగాళ్లు చెలరేగారు. రెండో వన్డేలో భారత బ్యాటర్లు అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. శుభ్‌మన్ గిల్ 104, శ్రేయస్ అయ్యర్ 105 పరుగులతో వరుస సెంచరీలు చేశారు. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 52 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. వన్డే ఫార్మాట్లో ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన అత్యధిక స్కోర్ ఇదే కావడం విశేషం.
Innings break!#TeamIndia post 399/5, their highest total in ODIs against Australia 👏👏
💯s from Shreyas Iyer & Shubman Gill 72* from Suryakumar Yadav 52 from Captain KL Rahul
మొదటగా టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆసీస్ పేసర్లను శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో ఉతికారేశారు. ఈ ఫార్మాట్లో గిల్‌కు ఇది ఐదో సెంచరీ కావడం విశేషం. 50 ఓవర్ల ఆటలో ఓకే ఏడాది 5 సెంచరీలు సాధించిన ఏడో భారత బ్యాటర్‌గా గిల్ రికార్డు నెలకొల్పాడు.
ఇకపోతే భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(SuryaKumar Yadav) మరోసారి తన పవర్ సాధించాడు. తన బ్యాట్ పవర్‌కు ఆసీస్ బౌలర్లు కంగారు పడ్డారు. కామెరూన్ గ్రీన్ వేసిన 44వ ఓవర్లో నాలుగు బంతులకు నాలుగు సిక్సులు బాది సూర్యకుమార్ చెలరేగిపోయాడు. భారత్ స్కోర్ 399/5 కావడంతో ఆస్ట్రేలియా టార్గెట్ 400 పరుగులుగా నిలిచింది.